మహేష్ బాబు మమ్మల్ని మోసం చేశాడు.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన మరదలు శిల్పా శిరోద్కర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్ర‌త్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఆయన ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్నారు. ఇప్పుడు రాజ‌మౌళితో వారణాసి మూవీతో గ్లోబ‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవ‌డం ఖాయమని అనిపిస్తోంది. ఆయన సినీ కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ విషయాల పరంగా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మహేష్ గురించి ఆయన మరదలు, నటి శిల్పా శిరోద్కర్ చెప్పిన ఓ ఆసక్తికర పంచుకున్నారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి.. చివరి కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు..
పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి.. చివరి కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు..

ఇటీవల మహేష్ బాబు మరదలు, నమ్రత సోదరి, బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ ' ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5' అనే ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ సమయంలో మహేష్ బాబు తమతో చాలా సంవత్సరాలు ఓ చిన్న సీక్రెట్ దాచిపెట్టి ఎలా ఆటపట్టించారో గుర్తు చేసుకున్నారు.

Shilpa Shirodkar Reveals Superstar Mahesh Babu s s Hidden Marathi Secret
Recommended For You
ఏడాది తర్వాత బిగ్ సీక్రెట్ రివీల్.. బిగ్ బాస్ నటుడు సర్ప్రైజ్ ఇచ్చాడుగా!
ఏడాది తర్వాత బిగ్ సీక్రెట్ రివీల్.. బిగ్ బాస్ నటుడు సర్ప్రైజ్ ఇచ్చాడుగా!

శిల్పా షిరోద్కర్ మాట్లాడుతూ.. తన సోదరి నమ్రతా షిరోద్కర్‌తో మహేష్ బాబు వివాహం జరిగిన తొలి రోజుల్లో ఆయనకు మరాఠీ భాష అసలు రాదని కుటుంబమంతా అనుకునేవాళ్లం.మహేష్ తెలుగు వ్యక్తి కావడంతో మరాఠీ అర్థం చేసుకోలేడనే భావించేవాళ్లం. ఆ నమ్మకంతో మహేశ్ బాబు ముందే నేను, నమ్రత వ్యక్తిగత విషయాలు మరాఠీలోనే మాట్లాడుకోనే వాళ్లం. ఎలాంటి సంకోచం లేకుండా సీక్రెట్స్ మాట్లాడుకునేవాళ్లం' శిల్పా గుర్తు చేసుకున్నారు.

You May Also Like
నాగార్జున 'కింగ్-100'లో బిగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ హీరోయిన్!
నాగార్జున 'కింగ్-100'లో బిగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ హీరోయిన్!

అయితే పెళ్లై కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు జరిగిన చిన్న సంఘటన వారిద్దరినీ పూర్తిగా షాక్‌కు గురిచేసిందని ఆమె చెప్పారు. 'నేను, నమ్రత ఇద్దరూ మరాఠీలో ఏదో మాట్లాడుకుంటూ ఉండగా, అకస్మాత్తుగా మహేష్ బాబు మధ్యలో కలగజేసుకుని మరాఠీలోనే "అచ్చా.. అసా కాయ్?" (అంటే "అలానా? నిజమా?")' అని అన్నారు. ఆ ఒక్క మాట మాకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయింది 'అంటూ శిల్పా నవ్వుతూ చెప్పారు. ఆ తరువాత మహేష్ బాబు మరాఠీలో మాట్లాడగానే "అరే.. నీకు మరాఠీ వచ్చా?" అని ఆశ్చర్యపోయామని శిల్పా తెలిపారు. అప్పుడు మహేష్ ఎంతో కూల్‌గా "మలా సమజ్తే మరాఠీ" (నాకు మరాఠీ అర్థమవుతుంది) అని చెప్పారట.

కష్టానికి ఫలితం.. సొంత ఇంట్లో అడుగుపెట్టిన బుల్లితెర కమెడియన్!
కష్టానికి ఫలితం.. సొంత ఇంట్లో అడుగుపెట్టిన బుల్లితెర కమెడియన్!

ఆ సమాధానం విన్న తర్వాత తామిద్దరం ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోయామని, ఇన్నేళ్లు ఆయన తమ మాటలన్నీ అర్థం చేసుకుంటూనే తెలియనట్లు నటించాడని అప్పుడు తెలిసిందని చెప్పారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ శిల్పా సరదాగా మాట్లాడుతూ.. "అదృష్టవశాత్తూ ఆయన ముందు ఎప్పుడూ చాలా సీక్రెట్ లేదా ఇబ్బందికరమైన విషయాలు మాట్లాడలేదు. ఒకవేళ అలాంటివి మాట్లాడి ఉంటే మేమిద్దరం చాలా ఇబ్బందిపడేవాళ్లం" అంటూ నవ్వేశారు. మహేష్ బాబు తనకు మఠారీ అర్థం కానట్టు నటించారనీ, తమని మోసం చేశారని ఫన్నీ కామెంట్స్ చేసింది.

రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..

మహేష్ బాబు, నమ్రతా షిరోద్కర్ దంపతులు 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు దశాబ్దాల వైవాహిక జీవితంతో ఎంతో సంతోషంగా ఉంటూ.. సినీ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరోవైపు, నమ్రత సోదరి శిల్పా షిరోద్కర్ కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీతో ఎంతో అప్యాయంగా ఉంటుంది. ప్రత్యేక సంబురాల్లో నమ్రాతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఇక శిల్పా షిరోద్కర్ ఇటీవల సినిమాల కంటే టెలివిజన్ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X