చిరంజీవి రికమండేషన్‌తో నా కెరీర్ అలా.. సునీల్ ఎమోషనల్ !

సునీల్.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన అనతికాలంలోనే స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకుంటూ.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని పాత్రలు కలిపి ఇప్పటి వరకూ దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రాణిస్తున్నారు. తాజాగా తన సినీ ప్రయాణం ఎలా మొదలైందో గుర్తు చేసుకుంటూ.. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
మహేష్ బాబు మమ్మల్ని మోసం చేశాడు.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన మరదలు శిల్పా శిరోద్కర్!
మహేష్ బాబు మమ్మల్ని మోసం చేశాడు.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన మరదలు శిల్పా శిరోద్కర్!

ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఇసకపట్నం'లో సునీల్ పవర్ పుల్ పోలీసు ఆఫీసర్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటుడు సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా యాంకర్ సుమ .. సునీల్ పాత డ్యాన్స్ వీడియోను చూపించి ఆశ్చర్యపరిచింది. ఈ సమయంలో తన సినీ ప్రయాణం ప్రారంభమైన రోజుల గురించి, మెగాస్టార్ చిరంజీవి తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవిపై ఉన్న అభిమానమే తన కెరీర్‌కు పునాది వేసిందని చెప్పిన ఆయన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Recommended For You
రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు.. 'రామాయణ' నిర్మాతలు తగ్గారా?
రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు.. 'రామాయణ' నిర్మాతలు తగ్గారా?
Sunil Reveals How Chiranjeevi s Recommendation Changed His Career Forever

ఓ కార్యక్రమంలో మాట్లాడిన సునీల్.. చిన్నప్పటి నుంచే తనకు డాన్స్ అంటే విపరీతమైన ఇష్టమని, ఆ ఇష్టానికి కారణం మెగాస్టార్ చిరంజీవేనని తెలిపారు. ఆ రోజుల్లో డ్యాన్స్ పోటీలకు వెళ్లే చాలామంది మైకేల్ జాక్సన్ ఇంగ్లీష్ పాటలను ఎంచుకునేవారని, కానీ తాను మాత్రం ఎప్పుడూ చిరంజీవి పాటలనే ఎంచుకునేవాడినని చెప్పారు. "అందరూ ఇంగ్లీష్ సాంగ్స్‌తో వస్తే.. నేను ఒక్కణ్ణే తెలుగు పాటతో వెళ్లేవాడిని. అది కూడా చిరంజీవి గారి పాటే. అదే నా కాన్ఫిడెన్స్" అని గుర్తు చేసుకున్నారు.

You May Also Like
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..

ఆ డ్యాన్స్ పోటీలో తాను వేసిన ప్లాన్ గురించి కూడా సునీల్ వివరించారు. "అందరూ స్టేజ్ మీదే డాన్స్ చేసేవారు. కానీ నేను మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించాను. నిర్వాహకులతో 'నేను స్టేజ్ మీద నుంచి స్టార్ట్ చేయను. ప్రేక్షకుల మధ్య నుంచి మ్యూజిక్ ప్రారంభించండి. అక్కడి నుంచి డాన్స్ చేస్తూ స్టేజ్ మీదకు వచ్చి, మళ్లీ స్టేజ్ నుంచి కిందికి వచ్చి ఆడియన్స్ మధ్యే నా పెర్ఫార్మెన్స్ ముగిస్తాను' అని చెప్పాను. నేను అనుకున్నట్లుగానే ఆ ప్రదర్శన చేశాను. ఆ ఐడియా అందరికీ కొత్తగా అనిపించింది. చివరకు అదే నాకు ఫస్ట్ ప్రైజ్ తెచ్చిపెట్టింది" అని తెలిపారు.

You May Also Like
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..

ఆ విజయం తన జీవితంలో మొదటి పెద్ద మలుపని సునీల్ అన్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. తన డ్యాన్స్ ప్రతిభను చూపించేలా ఓ ప్రత్యేక వీడియోను సిద్ధం చేయించుకున్నారట. "అది నా జీవితంలో మొదటి షోరీల్ లాంటిది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఆ వీడియోను కొందరికి మాత్రమే చూపించాను. తర్వాత దాన్ని ఎవరికీ ఇవ్వలేదు" అని చెప్పారు.

 Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?

అయితే ఆ వీడియోనే తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని సునీల్ వెల్లడించారు. "చిరంజీవి గారి 'ఠాగూర్' సినిమా సమయంలో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో 'అన్నయ్య... ఇది నా డ్యాన్స్ వీడియో' అని చూపించాను. ఆయన చాలా శ్రద్ధగా మొత్తం వీడియో చూశారు. వీడియో పూర్తయ్యాక ఎంతో ఆనందంగా 'ఈ వీడియో నాకు ఇవ్వు' అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. 'ఎందుకు అన్నయ్య?' అని అడిగితే... 'నీ టాలెంట్ నలుగురికి తెలియాలి కదా' అని చెప్పి, ఆ వీడియోను స్వయంగా జెమినీ టీవీ వారికి పంపించారు" అని గుర్తు చేసుకున్నారు.

నాగార్జున 'కింగ్-100'లో బిగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ హీరోయిన్!
నాగార్జున 'కింగ్-100'లో బిగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ హీరోయిన్!

చిరంజీవి చేసిన ఆ ఒక్క సిఫార్సు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని సునీల్ అన్నారు. "నేను ఎవరిని చూసి డాన్స్ నేర్చుకున్నానో, ఎవరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ రంగంలోకి వచ్చానో.. అదే వ్యక్తి నా టాలెంట్‌ను గుర్తించి, నాకు అవకాశాలు రావడానికి సహాయం చేశారు. అది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణం" అని తెలిపారు. సునీల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కొత్తవారిని ప్రోత్సహిస్తారు అనడానికి ఇదోక ఉదాహరణ.

Read more about: sunil anchor suma chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X