Welcome To The Jungle Day 1 Box Office: వెల్‌కమ్ టూ ది జంగిల్‌ భారీ ఓపెనింగ్స్.. అక్షయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, లారా దత్తా, దిశా పటానీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్, ఊర్వశి రౌటేలా, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్, పరేశ్ రావెల్‌తో సుమారుగా 30పైగా యాక్టర్లు, కమెడియన్లతో భారీగా నిర్మించిన చిత్రం వెల్‌కమ్ టూ ది జంగిల్. ఈ సినిమాను ఫిరోజ్ ఏ నాడియావాలా, రాకేష్ దాంగ్, వేదాంత్ వికాస్ బాలీ నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షైరా ఆహ్మద్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

Also Read
'97 టేక్స్‌తో మహేష్ బాబు, నేను.. ఒక్క రోజంతా ఒకే సీన్‌తో రాజమౌళి’
'97 టేక్స్‌తో మహేష్ బాబు, నేను.. ఒక్క రోజంతా ఒకే సీన్‌తో రాజమౌళి’

ఈ మూవీకి సాజిద్ వాజిద్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి స్వర్గీయ నీరజ్ ఓరా కథను అందించారు. ఇక సినిమాటోగ్రఫి: కబీర్ లాల్, ఎడిటర్: నితిన్ ఎఫ్‌సీపీ, మ్యూజిక్ కంపోజర్స్: విక్రమ్ మాంత్రోసే, తల్విందర్, ఎన్‌డీఎస్, ఆనంద్ రాజ్ ఆనంద్, కొరియోగ్రఫి: గణేష్ ఆచార్య, ఆదిల్ షేక్, ప్రిన్స్ గుప్తా, రాహుల్ శెట్టి, యాక్షన్ డైరెక్టర్: అబ్బాస్ ఆలీ మొఘల్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీకి వస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Recommended For You
Super Girl First Review: సూపర్ గర్ల్ ఫస్ట్ రివ్యూ
Super Girl First Review: సూపర్ గర్ల్ ఫస్ట్ రివ్యూ
Welcome To The Jungle Box Office Report

వెల్‌కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమాను భారీ తారాగణం, కశ్మీర్ లాంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన 34 మంది టాప్ యాక్టర్లు నటించారు. ఈ సినిమా కోసం లొకేషన్లలో 54 కార్‌వాన్‌లు ఉపయోగించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా భారీగా ఖర్చుకు వెనుకాడకుండా నిర్వహించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 300 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా టీజర్, కాస్టింగ్ వ్యవహారాల క్రేజీగా మారడంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ తదితర బిజినెస్ ద్వారా సుమారుగా 120 కోట్ల రూపాయలు రికవరీ అయ్యాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 200 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి.

You May Also Like
Welcome To The Jungle Movie Review: వెల్‌కమ్ టూ ది జంగిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Welcome To The Jungle Movie Review: వెల్‌కమ్ టూ ది జంగిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

దిశాపటానీ, జాక్వలైన్, రవీనా టాండన్ లాంటి గ్లామర్ తారలు నటించిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లకు మంచి రెస్సాన్స్ కనిపించింది. ఈ చిత్రానికి సంబంధించిన 2000కు పైగా ప్రీమియర్లు షోలు దేశవ్యాప్తంగా గురువారం ప్రదర్శించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణలో మంచి రెస్పాన్స్ కనిపించింది. ప్రీమియర్ల కోసం 50 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా 4.5 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను ఆన్ లైన్ బుకింగ్ ద్వారా సాధించింది. కరెంట్ బుకింగ్ కలిపితే ఈ చిత్రం మరో కోటి రూపాయలు వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Mahesh Babu Review on Rao Bahadur: రావు బహదూర్‌పై మహేష్ బాబు రివ్యూ
Mahesh Babu Review on Rao Bahadur: రావు బహదూర్‌పై మహేష్ బాబు రివ్యూ

అక్షయ్ నటించిన ఈ సినిమా తొలి రోజు మంచి స్పందన కనిపిస్తున్నది. మధ్యాహ్నం ఆటలు ముగిసే సమయానికి 2 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈవెనింగ్, నైట్ షోలకు అదే రెస్పాన్స్ లభిస్తే.. కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి సుమారుగా 15 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ప్రాథమికంగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గత కొద్ది కాలంగా అక్షయ్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని కూడగట్టుకోలేకపోయాయి. కానీ ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబట్టే ప్రయత్నం చేస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X