అతుల్ కులకర్ణి హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒడియా, ఇంగ్లీష్ భాషా చిత్రాల్లో నటించిన భారతీయ సినీ నటుడు.
అతుల్ కులకర్ణి 1965 సెప్టెంబర్ 10 న కర్ణాటకలోని బెల్గాం లో జన్మించారు. అతుల్ తన మాధ్యమిక విద్యను (10 వ తరగతి) మహారాష్ట్రలోని సోలాపూర్ లోని హరిభాయ్ దేవ్కరన్ హై స్కూల్ నుండి పూర్తి చేశాడు. అతని తండ్రి, ఒక వ్యాపారవేత్త మరియు అతని తల్లి గృహిణి సోలాపూర్లో స్థిరపడ్డారు.
జయంమనదేరా, గౌరి, రన్ 2003, లీలమహల్ సెంటర్, పంజా, రామ్, ప్రతి ఘటన, అనేకుడు, ఘాజీ, జెస్సీ వంటి మొదలగు చిత్రాలలో నటించారు.