భాణుచందర్
Born on 31 May 1953 (Age 70)
భాణుచందర్ బయోగ్రఫీ
భానుచందర్ ప్రముఖ నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను మరియు సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. భానుచందర్ కరాటే లో కూడా శిక్షణ పొందాడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు.
మన వూరి పాండవులు సినిమాతో చిత్రరంగంలొ హీరోగా మొదటి చిత్రం చేశాడు. అలా కొన్ని సినిమాలు చేసినా హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. తరువాత వచ్చిన చిన్న చిన్న అవకాశాలని వదలకుండ నటించారు.