X
హోమ్ » సెలెబ్స్ » చిరంజీవి » తెలియని విషయాలు
చిరంజీవి
Actor

చిరంజీవి - తెలియని విషయాలు

  • 1
    మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా తమ కుటుంబం అంతా ఎక్కువగా పూజించే ఆంజనేయ స్వామికి మరో పేరైన చిరంజీవి అనే పేరును తన తల్లి సూచనలు తన స్క్రీన్ నేముగా పెట్టుకున్నారు మెగాస్టార్.
  • 2
    అందరికీ మెగాస్టార్ చిరంజీవి బిరుదు మెగాస్టార్ అనే తెలుసు కానీ మెగాస్టార్ అనే బిరుదు పెట్టక ముందు ఆయనను సుప్రీం హీరో అని సంబోధించేవారు.
  • 3
    85 సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ వాడకుండా కేవలం చిరంజీవి అనే టైటిలే వాడారు. తర్వాత డేరింగ్ డాషింగ్ డైనమిక్ అనే టైటిల్స్ 11 సినిమాలకు వాడారు.
  • 4
    సుప్రీం హీరో అని 14 సినిమాలకు వాడారు. ఇక మెగాస్టార్ అని 34 సినిమాలుకు, నట కిషోర్ అని రెండు సినిమాలకు, సుప్రీం అనే రెండు సినిమాలకు,
  • 5
    రోరింగ్ లయన్ అని ఒక సినిమాకి సుప్రీం స్టార్ అనే ఒక సినిమాకి, మా ఘరానా చిరంజీవి అని ఒక సినిమాకి, నట విజేత అని ఒక సినిమాకి ఆయనను సంభోదించారు.
  • 6
    కెరీర్లో మంచి పీక్ పొజిషన్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం కూడా జరిగింది. అయితే ఈ విషయం అప్పట్లో బయటకు కూడా రాలేదు
  • 7
    మెగాస్టార్ ఇండియాలోని అత్యధిక భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు ఆ రోజుల్లో ఒక్కో సినిమాకు కోటి పాతిక లక్షలు అందుకుని మరీ హీరోకి సాధ్యం కాని రికార్డు ఆయన సృష్టించారు. అప్పట్లో ఇండియన్ టాప్ హీరోగా ఉండే అమితాబ్ కు కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేవారు.
  • 8
    సౌత్ నుంచి ఆస్కార్ అవార్డులకు ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు.
  • 9
    92లో విడుదలైన ఘరానా మొగుడు టాలీవుడ్ లో 10 కోట్లు కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ సినిమాల నిలిచింది.
  • 10
    ఇంద్ర సినిమాతో 30 కోట్ల షేర్ వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సంపాదించడమే కాక అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా కూడా నిలిచారు.
  • 11
    ఐదు ఇండస్ట్రీ హిట్లు సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పటికీ ఈ రికార్డు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు
  • 12
    ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య మెగాస్టార్ చిరంజీవికి నట కిషోర్ అనే బిరుదు ఇచ్చారు.
  • 13
    టాలీవుడ్ లో 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి కాగా 4 నంది అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
  • 14
    మెగాస్టార్ చిరంజీవి ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాలతో సినిమా నిలిచిపోయింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+