ఇవివి సత్యనారాయణ
Born on
ఇవివి సత్యనారాయణ బయోగ్రఫీ
ఇ.వి.వి సత్యనారాయణ(జూన్ 10, 1958 - జనవరి 21, 2011) సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మేరులో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. 19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు ఇతడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమఖైదీ చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు వంటి చిత్రాలు మరియు నరేష్తో జంబలకిడి పంబ మొదలైన చిత్రాలు తీశారు.
19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు.