X
ఫహద్ ఫాసిల్
Actor

ఫహద్ ఫాసిల్ బయోగ్రఫీ

ఫహాద్‌ ఫాజిల్ (జననం: 1982 ఆగస్టు 8) ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత. ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తాడు.నలభైకి పైగా చిత్రాలలో నటించాడు. ఒక భారత జాతీయ చలనచిత్ర పురస్కారాo, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, మూడు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు అవార్డులను అందుకున్నాడు. ఫహాద్ చిత్రనిర్మాత ఫాజిల్ కుమారుడు. 

20 జనవరి 2014 న, మలయాళ సినీ నటి నజ్రియా నజీమ్‌తో నిశ్చితార్థం జరిగింది, వీరి వివాహం 21 ఆగస్టు 2014 న తిరువనంతపురంలో వివాహం చేసుకున్నారు. అంజలీ మీనన్ బెంగుళూరు డేస్ (2014) సెట్స్‌లో ఈ జంట ఒకరినొకరు తెలుసుకున్నారు, ఇందులో వారు భార్యాభర్తల పాత్రలు పోషించారు. వివాహ ఏర్పాటులో వారి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారని ఫహద్ వెల్లడించారు.

ఫహద్ మొదటి చిత్రం, కైయెతుమ్ దూరత్ (2002). దీనికి అతని తండ్రి, దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యింది. 2014 లో ఆయన నిర్మించిన పెద్ద బడ్జెట్ చిత్రం అయోబింటే పుస్తకం లో నటించారు. బ్లాక్ బస్టర్ మూవీ బెంగుళూరు డేస్ లో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 2015 అతనికి నిస్తేజమైన సంవత్సరం. అతను తీసిన ఏ సినిమాలు విజయం సాధించలేదు. 2016 లో, అతని మొదటి విడుదల, మాన్‌సూన్ మామిడి బాక్సాఫీస్ వద్ద విఫలమైంది, అయినప్పటికీ అతని నటనకు ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం మంచి విమర్శకుల స్పందనలను అందుకుంది. అతని తదుపరి విడుదల 5 ఫిబ్రవరి 2016 న మహేషింతే ప్రతిరాకం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ప్రేక్షకులు, విమర్శకులచే ప్రశంసించబడింది. వరాతన్, న్జన్ ప్రకాషన్,, కుంబలంగి నైట్స్‌తో బాక్సాఫీస్ విజయాలు అందుకున్నాడు. ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద సమిష్టిగా ₹ 100 కోట్లకు పైగా వసూలు చేశాయి.


'ఫహాద్‌ ఫాజిల్‌' 2021లో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న 'పుష్ప' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+