Celebs » Gopichand » Biography
బయోగ్రఫీ
తొట్టెంపూడి గోపీచంద్ తెలుగు సిని నటుడు, టి. కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయిన గోపి చంద్ పుట్టుక, బాల్యం, ప్రాధమిక విద్య మద్రాస్ లో కొనసాగింది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపి ఫై చదువులకోసం రష్యా వెళ్ళాడు. మొదట్లో నటన మీద పెద్దగా ఆసక్తి చూపని గోపిచంద్ సమాజంలో పేరుకుపోయిన సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని విప్లవాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నన్నాడు.

తమ సొంత బ్యానర్ ఈతరం ఫిల్మ్స్ ఫై 2001 లో 'తొలివలపు' చిత్రం తో హీరోగా పరిచయమం అయ్యాడు. ఆ సినిమా పరాజయం పాలవడంతో నిరాస చెందారు. కానీ గోపి లోని టాలెంట్ ను గుర్తించిన తేజ తన జయం సినిమాలో 'విలన్ గా ఆవకాశం ఇచ్చి గోపిని ప్రోత్సహించాడు. జయంలో అద్భుత నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తరవాత చేసిన 'నిజం', 'వర్షం'  వైవిద్యంగా నటించి ఆడియన్స్ ను మెప్పించాడు. అదే సమయంలో సొంత బ్యానర్ లో 'యజ్ఞం' సినిమాతో తిరిగి హీరోగా రి- ఎంట్రీ ఇచ్చాడు. యజ్ఞం హిట్ అవడంతో గోపి హీరోగా స్థిరపడ్డాడు. నటనలో ప్రవేశించే ముందు ఒక సంవత్సరం పాటు నేర్చుకున్న డైలాగ్ మాడ్యులేషన్ కోర్స్ నటుడి గా మారిన తరవాత గోపీచంద్ కు పెద్ద ప్లస్ అయ్యింది. మంచి ఎత్తుతో, దృడమైన దేహ దారుడ్యంతో, చురుకైన చూపులతో. స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్ హీరోకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న గోపిచంద్ ఆనతి కాలంలోనే తెలుగు సినిమాలలో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. యజ్ఞం తరవాత 'రణం' , 'లక్ష్యం' 'సౌర్యం' వంటి చిత్రాల విజయంతో మాస్ ప్రేక్షకులను అలరించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more