twitter

    జగపతి బాబు బయోగ్రఫీ

    జగపతిబాబు తెలుగు సిని నటుడు. జగపతి బాబు విజయవాడలో పుట్టి మద్రాస్ లో పెరిగారు. మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు సినిమాల్లోకి రావటం  జరిగింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేశాడు. 

    పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి 'గాయం' హిట్ తో హీరోగా స్థిరపడ్డాడు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం దాసోహం అయ్యారు. యస్.వి.కృష్ణరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'శుభలగ్నం' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో పనిచేసాడు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నారు. అలా అని ఏఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలను చేస్తూ వచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'అంతఃపురం' సినిమాలో చేసిన సారాయి వీరాజు  పాత్రలో జీవించి ప్రేక్షకులను మైమరపించారు. ఆ తరవాత సముద్రం, మనోహరం వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే తెలుగు సినిమాకు సంబంధించి ఏ విధమైన ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా కేవలం ప్రేక్షకుల అభిమానంతోనే చాలాకాలం నుండి హీరోగా కొనసాగుతున్నాడు జగపతి బాబు. పాత్ర ఎటువంటిదైనా తనదైన నటనతో రక్తికట్టించగల నటుడిగా ముద్రవేయించుకున్న జగపతిబాబు ఆవకాశాలను సృష్టించుకోవడంలో నేటి యువతరం హీరోలతో పోటిపడుతున్నారు.    
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X