కమల్ హాసన్
Born on 07 Nov 1954 (Age 66) చెన్నై, తమిళనాడు
కమల్ హాసన్ బయోగ్రఫీ
కమల్ హాసన్ భారతదేశపు సినీ ప్రముఖ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు.యూనివర్సల్ హీరోగా ప్రసిద్ది చెందారు.
కమల్ హాసన్ నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో పుట్టాడు
కమల్ 3 1/2 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.
తెలుగు లో అంతులేని కథ, మరో చరిత్ర, సాగర సంగమం, ఆకలి రాజ్యం, స్వాతి ముత్యం, క్షత్రియ పుత్రుడు, పుష్పక విమానం, ఇంద్రుడు చంద్రుడు, భారతీయుడు, తెనాలి, పంచ తంత్రం, బ్రహ్మాచారి ఈనాడు వంటి మొదలగు చిత్రాల్లో నటించారు.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు భారతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నందుకు హసన్ ప్రసిద్ది చెందారు మరియు ఉత్తమ విదేశీ భాషా చిత్రానికి అకాడమీ అవార్డుకు పోటీలో భారతదేశం సమర్పించిన అత్యధిక చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందారు. నటన మరియు దర్శకత్వంతో పాటు, అతను స్క్రీన్ రైటర్, గేయ రచయిత, ప్లేబ్యాక్ సింగర్ మరియు కొరియోగ్రాఫర్. అతని చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ తన పలు చిత్రాలను నిర్మించింది.
సంబంధిత వార్తలు