twitter
    CelebsbredcrumbKrishnabredcrumbUnknown Facts

    Unknown Facts

    • 1
      1942, మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. నేడు 78వ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ
    • 2
      తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే
    • 3
      అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చారు సూపర్ స్టార్ కృష్ణ.
    • 4
      హీరోగా 56 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ కృష్ణ
    • 5
      ముగ్గురు కూతుళ్లు. పద్మావతి,మంజుల,ప్రియదర్శినితో సూపర్ స్టార్ కృష్ణ
    • 6
      ‘అల్లూరి సీతారామరాజు’ తో నటుడిగా ఎనలేని ఖ్యాతి. హీరోగా కృష్ణకు 100వ చిత్రం. తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రం ’అల్లూరి సీతారామరాజు’.
    • 7
      హీరోగా సూపర్ స్టార్ కృష్ణ 300వ చిత్రం ‘తెలుగు వీర లేవరా’. తెలుగులో తొలి DTS మూవీ.
    • 8
      350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ
    • 9
      1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు. కృష్ణ చూసిన తొలి చిత్రం 'పాతాళభైరవి'. బాగా ఆకట్టుకున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌కి అభిమాని అయ్యారు. 'దేవదాసు' వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలికి వచ్చిన ఏఎన్నార్‌, సావిత్రిలను చూడడానికి వేల మంది జనం రావడంతో.. ఒక హీరోను ఇంతగా అభిమానిస్తారా ? అని ఆశ్చర్య పోయారు. హీరోగా మారాలనే ఆలోచనకు నాంది పలికింది ఈ సంఘటనే
    • 10
      సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలో రాణించాలంటే నాటకాల్లో ఫ్రూవ్‌ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. 1960లో కృష్ణ తొలిసారిగా స్టేజ్‌ మీద 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం.ఆ తర్వాత 'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్‌' వంటి నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
    • 11
      కృష్ణ తొలిసారి హీరోగా ఎంపికైన చిత్రం 'కొడుకులు కోడళ్ళు'. కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది. 'మూగ మనసులు' చిత్రం విడుదలైన తర్వాత 'తేనె మనసులు' కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్‌ యాడ్‌ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు. హీరోగా ఎంపికైనప్పటికీ బక్కగా ఉన్నావు, నువ్వేం నటిస్తావని చాలా మంది దెప్పిపోడిచారట. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు జడ్జ్‌మెంట్‌ తప్పన్నారు.
    • 12
      'తేనెమనసులు' విడుదలై సంచలన విజయం సాధించాక కృష్ణ ఎంపిక విషయంలో అదుర్తి నిర్ణయం హండ్రెడ్‌ పర్సెంట్‌ కరెక్ట్‌ అని అందరికీ అర్థమైంది. తొలి చిత్రంతోనే నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
    • 13
      1968 నుంచి 74 వరకు ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఆ టైమ్‌లో తెనాలిలో ఉన్న ఏడు థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవంటే అతిశయోక్తి కాదు. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించిన ఘనత కృష్ణదే. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు ముద్దుగా 'సూపర్‌స్టార్‌' అని పిలుచుకుంటారు.
    • 14
      కృష్ణ దాదాపు 80మందికిపైగా హీరోయిన్లతో నటించారు. వారిలో ఎక్కువగా నటించింది మాత్రం విజయనిర్మల. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 48 సినిమాలొచ్చాయి. ఆ తర్వాత జయప్రదతో 47 చిత్రాల్లో, శ్రీదేవితో 31 చిత్రాల్లో, రాధతో 23 చిత్రాల్లో నటించారు.
    • 15
      25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. తొమ్మిదేళ్ళలో 100 సినిమాల్లో నటించిన ఎవర్‌గ్రీన్‌ రికార్డూ కృష్ణకే సొంతం. నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు. అలాగే 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.
    • 16
      'సింహాసనం' చిత్రంతో దర్శకుడిగా మారారు కృష్ణ. సూపర్ స్టార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం హిందీలో కూడా ఏకకాలంలో విడుదలై రెండు భాషల్లోనూ రికార్డు విజయం సాధించింది.ఆ తర్వాత ఈయన స్వీయ దర్శకత్వంలో 'కళియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు', 'కొడుకు దిద్దిన కాపురం', 'రిక్షావాలా', 'అన్నాతమ్ముడు', 'నాగాస్త్రం', 'ఇంద్ర భవనం', 'రక్త తర్పనం', 'అల్లుడు దిద్దిన కాపురం' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
    • 17
      న సినీ కెరీర్‌లో వందకు పైగా దర్శకులతో పనిచేశారు. అందులో ఎక్కువగా కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో 31 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత విజయనిర్మల దర్శకత్వంలో నటించారు. చంద్రశేఖర్‌ రెడ్డి, కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు తదితరులతో ఎక్కువగా పనిచేశారు.
    • 18
      56 ఏండ్ల కెరీర్‌లో 350కిపైగా చిత్రాల్లో నటించిన కృష్ణ.. 'గూఢచారి 116', 'సాక్షి', 'మోసగాళ్లకు మోసగాడు', 'పండంటికాపురం', 'దేవుడు చేసిన మనుషులు', 'అల్లూరి సీతారామరాజు', 'దేవదాసు', 'కురుక్షేత్రం', 'భలే దొంగలు', 'మనస్సాక్షి', 'ఈనాడు', 'సింహాసనం', 'ముద్దు బిడ్డ', 'నంబర్‌ 1' వంటి చిత్రాలు కృష్ణలోని నటనకు ప్రతిబింబాలు. ఈ చిత్రాలు ఆయనకు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. 'సాక్షి' వంటి పలు సినిమాలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. ఆయన నటించిన వాటిలో పౌరాణికాలు, జానపదాలు, చరిత్ర నేపథ్యాలు, ప్రేమకథలు, ఫ్యామిలీ చిత్రాలు చేసినప్పటికీ అన్నింటిలోనూ కమర్షియల్‌ అంశాలు ఉండేలా జాగ్రత్తపడ్డారు.
    • 19
      నటుడు మురళీ మోహన్‌, దర్శకుడు క్రాంతికుమార్‌ డిగ్రీ టైమ్‌లో కృష్ణకు రూమ్‌మేట్స్‌. ఆ తర్వాత మురళీమోహన్‌, శోభన్‌బాబు స్నేహితులయ్యారు. కృష్ణ జీవితంలో అసలైన ప్రాణ స్నేహితులు వీళ్ళిద్దరే.
    • 20
      కృష్ణ 19వ ఏట అంటే 1962లో ఇందిరాదేవిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని జన్మించారు. రమేష్‌ బాబు తొలుత నటుడిగా రాణించి ఆ తర్వాత నిర్మాతగా మారారు. అలాగే మంజుల కూడా నటిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. మహేష్‌బాబు అగ్ర హీరోగా రాణిస్తున్న విషయం విదితమే. 1969లో 'సాక్షి' సినిమా ద్వారా పరిచయమైన కథానాయిక విజయనిర్మలను వివాహమాడారు.
    • 21
      2008లో ఆంధ్రయూనివర్సిటీ 'గౌరవ డాక్టరేట్‌'తో ఆయన్ని ఘనంగా సత్కరించింది. భారతీయ సినిమాకు చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌ పురస్కారంతో కృష్ణను సముచితంగా గౌరవించింది. అలాగే 2003లో ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును అందుకున్నారు. ఫిల్మ్‌ ఫేర్‌ లైఫ్‌ ఎఛీవ్‌మెంట్‌ పురస్కారం సైతం కృష్ణని వరించింది. దక్షిణాదిన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో 1997వ సంవత్సరానికి ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డునూ ఆయన సొంతం చేసుకున్నారు. తొలినాళ్ళలో ఆయన నటించిన 'సాక్షి' చిత్రం 1968లో తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శిత మైంది.
    • 22
      1972లో ఆయన నటించిన 'పండంటి కాపురం' చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్‌ అవార్డుని కూడా కైవసం చేసుకుంది. కృష్ణకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. రాజీవ్‌ గాంధీ ఒత్తిడి మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో ఏలూరు నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచారు. రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.
    • 23
      ఇన్నేళ్ళ సినీ ప్రస్థానంలో కృష్ణ అన్ని రకాల పాత్రలను పోషించారు. ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్నది ఆయన కోరిక. కానీ చంద్రహాస్ సినిమాలో శివాజీ పాత్రను పోషించారు. మరోవైపు ‘యాక్టర్ సినీ యాక్టర్’, భారత సింహం’ వంటి సినిమాల్లో పాటలో భాగంగా ఛత్రపతి పాత్రలో అలరించారు కృష్ణ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X