యమ్ ఎస్ నారాయణ బయోగ్రఫీ

  ఎమ్. ఎస్. నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. సినిమాలకి ముందు ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. మొదట సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు. దాదాపు 700  చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.
  స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. కళాప్రపూర్ణని  ప్రేమ వివాహము చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్.
  ఎమ్మెస్ నారాయణ తన నటనకుగాను 5 నంది అవార్డులు ( రామసక్కనోడు, మానాన్నకు పెళ్ళి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు). దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాలకిపైగా తాగుబోతు పాత్రల్లో నటించి ఒదిగిపోయారు. అలాగే పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆఖరి చిత్రం పటాస్, ఈ చిత్రంతో తన సినిజీవితానికి స్వస్తి చెప్పారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ 2015, జనవరి 23 న మృతిచెందారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X