twitter
    CelebsbredcrumbMohan BabubredcrumbBiography

    మోహన్ బాబు బయోగ్రఫీ

     మోహన్ బాబు మంచు భక్తవత్సలం నాయుడు, నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్ గా, హీరోగా, క్యారక్టర్ నటుడిగా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్న మోహన్ బాబు భక్తవత్సలం నాయుడుగా చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య యర్పేడు, తిరుపతి లలో సాగింది. ఆ తరవాత మద్రాసు లో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో పట్టభద్రులయ్యారు. చిన్నప్పటి నుండి నాటకాలఫై ప్రత్యేక అభిమానం కలిగిన భక్తవత్సలం నటనఫై ఆసక్తి పెంచుకున్నారు. నటుడు అవ్వాలనే కోరికను తన గ్రామంలోనివారితో అన్నప్పుడు వాళ్ళు ఆయన్ని నిరుత్సాహపరచారు. కానీ ఆ మాటలను పట్టించుకోకుండా తన కల నేరవేర్చుకోవటానికి చెన్నపట్నం చేరుకున్నారు. అక్కడ కొన్నాళ్ళు వై.యం.సి.ఏ. కాలేజీలో ఫిజికల్ ట్రైనీగా పనిచేసారు. కానీ నటుడు అవ్వాలనే కోరిక ఆయన్నినిలకడగా నిలబడనియ్యక పరుగులెత్తించింది. అవకాశాలకొసం ఎండా, వానా, ఆకలి దప్పికలు లెక్కచేయక తిరిగి తిరిగి అలసిపోయారు. కొన్నిరకాల పరిస్థితులమూలంగా ఆయన సహాయ దర్శకుడు గా మారవలసివచ్చింది. అలా ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర పనిచేసారు. 1975 లో దాసరి నారాయణరావు గారు కొత్త నటి నటులతో నిర్మించ తలపెట్టిన 'స్వర్గం-నరకం' చిత్రం కోసం జరిగిన ఆడిషన్ లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తోలి ఆవకాశం సంపాదించారు. దాసరి గారే భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండి తెరకు పరిచయం చేసారు. ఆ చిత్రం విజయంతో నట ప్రస్థానం ప్రారంబించిన మోహన్ బాబు 35 సంవత్సరాల కాలంలో విలక్షణమైన పాత్రలలో 500 ఫైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అందులోని 80 చిత్రాలలో ప్రధాన భూమికను పోషించారు. 
    ' 80వ దశకంలో విలన్ గానే ఎక్కువ ఆకట్టుకున్న మోహన్ బాబు 1990 వ దశకంలో పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అల్లుడుగారు తో సోలో హీరో గా నిలదొక్కుకున్న మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, రౌడిగారి పెళ్ళాం, అల్లరి మొగుడు వంటి చిత్రాలతో కలక్షన్ల మోత మోగించి 'కలక్షన్ కింగ్ ' అనిపించుకున్నారు. రజిని కాంత్ అతిధి పాత్రలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన 'పెదరాయుడు' అప్పటివరుకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది.  నటునిగానే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు గుర్తింపు పొందారు. నటుడిగా ఆయన సూపర్ హిట్ సినిమాలు అన్ని తన సొంత బ్యానర్ లోనే రావటం విశేషం. 1983 లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్  స్థాపించి ఇప్పటి వరుకు 56 చిత్రాలను నిర్మించారు. మోహన్ బాబు 1992 లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించడం ద్వారా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. 1995 లో యన్.టి.ఆర్ ప్రోద్బలంతో రాజ్యసభ ఎమ్.పి. గా పనిచేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X