twitter

    ముత్యల సుబ్బయ్యా బయోగ్రఫీ

    ముత్యాల సుబ్బయ్య తెలుగు సినిమా దర్శకుడు. ఎక్కువగా కుటుంబ కథాచిత్రాలు దర్శకత్వం వహించాడు. ఈయన దాదాపు 50 సినిమాలకి దర్శకత్వం వహిస్తే 75 శాతం విజయం సాధించాయి. 


    ఈయన నెల్లూరు జిల్లాలోని పార్లపల్లి గ్రామంలో దిగువ మధ్య తరగతి వ్యవసాయాధారిత కుటుంబంలో ముత్యాల శంకరయ్య, ముత్యాల శేషమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. . ఉన్నత పాఠశాల చదువూ, కాలేజీ అంతా ఈ ఊరునుంచే సాగింది. పి.యూ.సి అయ్యాక, ఊరికి పక్కనే ఉన్న విడవలూరు కాలేజీలో బి.కామ్ లో చేరారు. కాలేజీలో రెండేళ్ళు ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా పనిచేశారు కానీ డిగ్రీ అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

    హైస్కూల్లో ఉండగానే అంటే 8 వ తరగతి నుంచే నాటకాలమీద ఆసక్తి ఉండేది. కాలేజీకి వచ్చే సరికి అది పరాకాష్ఠకి చేరుకుంది. కాలేజీ పూర్తయే సరికి దాదాపు 100 నాటకాల్లో నటించడం, ఉత్తమనటుడుగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు తెచ్చుకోవడం జరిగింది. 


    చిరంజీవితో హిట్లర్, అన్నయ్య, వెంకటేశ్ తో పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం,  బాలకృష్ణతో ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, పవిత్రప్రేమ, కృష్ణబాబు ఇంకా ఇతర హీరోలతో పల్నాటి పౌరుషం, మామగారు, సోగ్గాడి పెళ్ళాం, 
    దీవించండి, తోలివలపు వంటి సినిమాలు తీసాడు 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X