నాగ చైతన్య బయోగ్రఫీ

  అక్కినేని నాగచైతన్య తెలుగు సిని నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు మరియు విక్టరి వెంకటేష్ మేనల్లుడు, ఇద్దరు దాదా సాహెబ్ ఫాల్కే ల ముద్దుల మనవడిగా, నాన్న, మేనమామల నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా పరిచయం అయిన అక్కినేని నాగచైతన్య హైదరాబాద్లో పుట్టాడు. అమ్మ నాన్నల మద్య కలతలకారణంగా తల్లితో పాటు మద్రాస్ వెళ్ళిన చైతు ప్రాధమిక విద్యను అక్కడి పి.యస్.బి.బి స్కూల్ లో కొనసాగించాడు. చదువుకునే రోజుల్లో గిటార్, డ్రమ్స్ ను వాయిస్తూ బ్యాండ్ లో పాల్గొనేవాడు. మొదట్లో నటన మీద ఆసక్తి కనబరచని చైతు కార్ రేసింగ్ అంటే ఇష్టపడేవాడు. కానీ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో నటన వైపు అడుగులు వేసాడు. ముంబైలోని యాక్టింగ్ స్కూల్ లోను, కాలిఫోర్నియా హాలీవుడ్ స్టూడియోలోను నటనలో శిక్షణ తీసుకున్నాడు. 

  నాగచైతన్యని  'జోష్' చిత్రం ద్వారా తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం చేసాడు నాగార్జున, నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రం 'ఏం  మాయ చేసావే' లో ఛాన్స్ కొట్టేసాడు. భారీ అంచనాలతో విడుదల అయిన 'జోష్' బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేయలేకపోయినా నటుడిగా చైతుకు గుర్తింపు నిచ్చింది. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల అయిన  'ఎం మాయ చేసావే' సినిమా హిట్ అవటంతో చైతు హీరోగా నిలదొక్కుకున్నాడు.

  తర్వాత నాగచైతన్య సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ స్టోరి మంచి విజయం సాదించింది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం దడ, వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలాపాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి.నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది.ఆ తర్వాత 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.సుధీర్ వర్మ దర్శకత్వంలో 'దోచేయ్' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు.ఆ వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసమే శ్వాసగా సాగిపో'అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.'రారండోయ్ వేడుక చూద్దాం'తో మళ్ళీ ఘన విజయం సాధించింది. విడుదల అయిన శైలజా రెడ్డి  అల్లు డు విజయం సాదించింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X