1967లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం
1988లో కేంద్ర ప్రభుత్వుం నుంచి పద్మభూషణ్..
1990 రఘుపతి వెంకయ్య అవార్డ్ : ఏప్రిల్ 1990 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
దాదాసాహెబ్ ఫాల్కే : మే 1991 (కేంద్ర ప్రభుత్వం)
అన్న అవార్డ్ : నవంబర్ 1995 (తమిళనాడు ప్రభుత్వం)
ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్ : నవంబర్ 1996 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
కాళిదాస కౌస్తుభ : నవంబర్ 1996 (మధ్యప్రదేశ్ ప్రభుత్వం)
చిత్తూరు వి. నాగయ్య అవార్డ్ : మార్చి 2009 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
2011లో కేంద్రం నుంచి ‘పద్మ విభూషణ్’ అవార్డు అందుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, దక్షిణ భారత హిందీ ప్రచారసభ నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అక్కినేని భారతీయ చలన చిత్ర రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో సుబ్బరామిరెడ్డి మిలీనియం అవార్డును కూడా అందుకున్నారు. అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని (2012) పొందారు.
'మేఘ సందేశం' (1982), 'బంగారు కుటుంబం' (1994) చిత్రాల్లో ప్రదర్శించిన నటనకు గాను రెండు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డును అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
మరోవైపు 'మరపురాని మనిషి' (1973), 'సీతారామయ్యగారి మనవరాలు' (1991), 'బంగారు కుటుంబం' (1994) చిత్రాలకు గాను ఉత్తమ నటునిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించారు.