నాగేశ్వరరావు అక్కినేని

  Born on 20 Sep 1923 (Age 97) వెంకటరావు పురం, ఆంద్రప్రదేశ్

  నాగేశ్వరరావు అక్కినేని బయోగ్రఫీ

  అక్కినేని అప్పటి మద్రాసు రాష్ట్రములోని  కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవాపురం అనే గ్రామంలో పేద వ్యవసాయకుటుంబంలో జన్మించారు. ప్రాధమిక విద్యతోనే చదువుకు ఆటంకం ఏర్పడింది. కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా 9 సంవత్సరాల ప్రాయంలోనే నటనను వృత్తిగా స్వీకరించి ఎన్నో నాటకాలలో నటించారు. అప్పటి నాటకాల్లో మగవారే అడవేషాల్లో కూడా నటించేవారు. అలా తన కళారంగ ప్రారంభదశలో స్త్రీపాత్రల్లో అలరించారు. తరవాత 1941 లో 'ధర్మపత్ని' సినిమాతో అక్కినేని సినీప్రస్థానం మొదలయింది. ఆ సినిమాలో హీరో చిన్ననాటి స్నేహితుని పాత్రలో నటించారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల బలరామయ్య దృష్టిలోపడి 'సీత రామ జననం ' చిత్రంలో రాముడుగా నటించటంతో అక్కినేనికి బ్రేక్ దొరికింది. అక్కడినుంచి 69 సంవత్సరాల సుదీర్ఘ  కాలంపాటు 258 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. తోలి లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా, మొట్టమొదటి డ్యాన్సింగ్ హీరోగా అక్కినేనిది తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం. జానపద, పౌరాణిక చిత్రాలలో నటించినప్పటికీ సాంఘిక, కుటుంబకధా చిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. 

  అక్కినేని నటజీవితంలో అజరామరమైన చిత్రాలు ఎన్నో తెనాలి రామకృష్ణ, కాళిదాసు, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కధ, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశం వాటిలో మచ్చుకకు కొన్ని. అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు సినీపరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావటంలో కీలకపాత్ర పోషించారు అక్కినేని.  
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X