twitter
    CelebsbredcrumbNageshwara Rao Akkineni
    నాగేశ్వరరావు అక్కినేని

    నాగేశ్వరరావు అక్కినేని

    Actor
    Born : 20 Sep 1923
    Birth Place : వెంకటరావు పురం, ఆంద్రప్రదేశ్
    అక్కినేని అప్పటి మద్రాసు రాష్ట్రములోని  కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవాపురం అనే గ్రామంలో పేద వ్యవసాయకుటుంబంలో జన్మించారు. ప్రాధమిక విద్యతోనే చదువుకు ఆటంకం ఏర్పడింది. కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా 9 సంవత్సరాల ప్రాయంలోనే నటనను... ReadMore
    Famous For
    అక్కినేని అప్పటి మద్రాసు రాష్ట్రములోని  కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవాపురం అనే గ్రామంలో పేద వ్యవసాయకుటుంబంలో జన్మించారు. ప్రాధమిక విద్యతోనే చదువుకు ఆటంకం ఏర్పడింది. కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా 9 సంవత్సరాల ప్రాయంలోనే నటనను వృత్తిగా స్వీకరించి ఎన్నో నాటకాలలో నటించారు. అప్పటి నాటకాల్లో మగవారే అడవేషాల్లో కూడా నటించేవారు. అలా తన కళారంగ ప్రారంభదశలో స్త్రీపాత్రల్లో అలరించారు. తరవాత 1941 లో 'ధర్మపత్ని' సినిమాతో అక్కినేని సినీప్రస్థానం మొదలయింది. ఆ సినిమాలో హీరో చిన్ననాటి స్నేహితుని పాత్రలో నటించారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల బలరామయ్య దృష్టిలోపడి 'సీత రామ జననం ' చిత్రంలో రాముడుగా నటించటంతో అక్కినేనికి బ్రేక్ దొరికింది. అక్కడినుంచి 69 సంవత్సరాల...
    Read More
    • 1
      అక్కినేని నాగశ్వరరావు వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. 1941లో తెరకెక్కిన 'ధర్మపత్ని' సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం 'శ్రీ సీతారామ జననం' సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు.
    • 2
      1941లో తెరకెక్కిన 'ధర్మపత్ని' సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం 'శ్రీ సీతారామ జననం' సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు.
    • 3
      ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. చలన చిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1991లో అందుకున్నారు.
    • 4
      దేశానికి సంబంధించి రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్‌’ను సైతం పొందారు. తెలుగు చిత్రపరిశ్రమకు కాదు.. కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన తొలి నటుడు అక్కినేని
    • 5
      భారత దేశంలో తొలి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న తొలి నటుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు.
    • 6
      ఆయన అందుకున్న బిరుదుల్లో 'నట సార్వభౌమ', 'నట రాజశేఖర', 'కళాప్రవీణ', 'అభినయ నవరస సుధాకర', 'కళా శిరోమణి', 'అభినయ కళాప్రపూర్ణ', 'భారతమాత ముద్దుబిడ్డ' వంటివి ఉన్నాయి.
    • 7
      1967లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం
      1988లో కేంద్ర ప్రభుత్వుం నుంచి పద్మభూషణ్..
      1990 రఘుపతి వెంకయ్య అవార్డ్ : ఏప్రిల్ 1990 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
      దాదాసాహెబ్ ఫాల్కే : మే 1991 (కేంద్ర ప్రభుత్వం)
      అన్న అవార్డ్ : నవంబర్ 1995 (తమిళనాడు ప్రభుత్వం)
      ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్ : నవంబర్ 1996 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
      కాళిదాస కౌస్తుభ : నవంబర్ 1996 (మధ్యప్రదేశ్ ప్రభుత్వం)
      చిత్తూరు వి. నాగయ్య అవార్డ్ : మార్చి 2009 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)
      2011లో కేంద్రం నుంచి ‘పద్మ విభూషణ్’ అవార్డు అందుకున్నారు.
    • 8
      ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, దక్షిణ భారత హిందీ ప్రచారసభ నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అక్కినేని భారతీయ చలన చిత్ర రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో సుబ్బరామిరెడ్డి మిలీనియం అవార్డును కూడా అందుకున్నారు. అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని (20పొందారు.
    • 9
      'మేఘ సందేశం' (1982), 'బంగారు కుటుంబం' (199చిత్రాల్లో ప్రదర్శించిన నటనకు గాను రెండు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డును అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
    • 10
      మరోవైపు 'మరపురాని మనిషి' (1973), 'సీతారామయ్యగారి మనవరాలు' (1991), 'బంగారు కుటుంబం' (199చిత్రాలకు గాను ఉత్తమ నటునిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించారు.
    నాగేశ్వరరావు అక్కినేని వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X