twitter

    నందమురి తారకరత్న బయోగ్రఫీ

    నందమూరి తారకరత్న తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు మనుమడు. అతడు ఫిబ్రవరి 22 1983న జన్మించిన ఆయన నందమూరి మోహన కృష్ణ తనయుడు.

    2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చాడు తారక్. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు.


    ఈ హీరోకు మాత్రం ఓ వరల్డ్ రికార్డు ఉంది. ఇండస్ట్రీకి ఎవరైనా ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. లేదంటే రెండు సినిమాలతో వస్తారు. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన హీరో నందమూరి తారకరత్న. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. ఒకటి రెండు కాదు ఏకంగా 9 సినిమాలు ఒకే రోజు మొదలయ్యాయి. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ అది వరల్డ్ రికార్డే.


    9 సినిమాలలో చాలా వరకు విడుదల కాలేదు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు.. అగ్ర దర్శకులతో కూడా మొదలుపెట్టాడు తారకరత్న. కానీ ఎందుకో అవి తర్వాత మెటిరియలైజ్ కాలేదు. కేవలం ముహూర్తంతోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పుడు మొదలుపెట్టిన సినిమాలలోనే ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.

    కొన్ని సినిమాల్లోనూ విలన్‌గా మెప్పించే ప్రయత్నం చేసాడు. మొత్తంగా 21 సినిమాల్లో నటించాడు. నటుడిగా ‘సారథి’ తర్వాత ఏ సినిమా చేయలేదు. త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. 

    మరణం 

    జనవరి 27న ‘యువగళం’  పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆయన్ను తొలుత కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ 18/2/2023 శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X