నవీన్ చంద్ర బయోగ్రఫీ
నవీన్ చంద్ర ఒక సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేయడం అంటే ఆసక్తి ఎక్కువ ఉండడంతో సినిమాలలొ ప్రయత్నించారు.
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు వచ్చింది. నాని కథానాయకుడిగా వచ్చిన నేను లోకల్ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పోలీసు పాత్రలో నటించాడు. త్రిపుర, లచ్చిందేవికి ఓలెక్కుంది. ప్రతినాయకుడిగా కొన్ని ప్రముఖ చిత్రాలలొ నటించారు. సహాయ నటుడిగా దేవదాస్, స్కాం, వినయ విధేయ రామ వంటి చిత్రాలలొ నటించారు.
సంబంధిత వార్తలు