CelebsbredcrumbPrabhasbredcrumbUnknown Facts

  Unknown Facts

  • 1
   1979 అక్టోబర్ 23న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తురులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. 2002లో కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
  • 2
   ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ...2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్‌ను మలుపు తిప్పింది. హీరోగా ప్రభాస్‌కు మూడో సినిమా. ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.
  • 3
   ఆ తర్వాత ‘అడవిరాముడు’, ‘చక్రం’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ‘చక్రం’ మూవీతో డిఫరెంట్ మూవీస్ చేయగలడు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రభాస్.
  • 4
   ప్రభాస్ సినీ కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘చత్రపతి’. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ‘ఛత్రపతి’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. సెంటిమెంట్ ను కూడా అదే స్థాయిలో పండించి మెప్పించాడు ప్రభాస్. ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాతో ప్రభాస్ డైలాగ్ డెలివరీ పూర్తిగా మారిపోయింది.
  • 5
   ‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ విభిన్న పాత్రలను పోషించాడు. ‘పౌర్ణమి’లో క్లాస్ క్యారెక్టర్, ‘యోగి’లో మదర్ సెంటిమెంట్‌తో కలిపిన యాక్షన్, ‘మున్నా’లో వెరైటీ యాక్షన్, ‘బుజ్జిగాడు’లో ఫుల్ మాస్ క్యారెక్టర్‌తో పాటు కామెడీని పండించాడు.
  • 6
   బిల్లా మూవీతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు ప్రభాస్. ఈ సినిమాలో డబుల్ రోల్ తో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. అండర్ వరల్డ్ డాన్ గా కనిపించాడు.
  • 7
   మాస్ పాత్రలు మాత్రమే కాకుండా ‘డార్లింగ్’ వంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ లోని మాస్‌ను మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో.. ప్రభాస్‌లోని నటుడిని చూశారు.
  • 8
   ఆ తర్వాత చేసిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు ప్రభాస్
  • 9
   ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచిన మూవీ ‘మిర్చి’. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు. ఈ సినిమా లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
  • 10
   తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన సినిమా ‘బాహుబలి’. ఇందులో బాహుబలిగా ప్రభాస్ యాక్షన్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగింది. రెబల్ స్టార్ పేరు హాలీవుడ్ వరకూ వెళ్లింది.
  • 11
   ఇక బాహుబలి 2 పార్ట్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాడు.
  • 12
   తాజాగాా ‘సాహో’ తో పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.
  • 13
   ఇక బాహుబలితో వచ్చిన ఈ క్రేజ్ వల్లే థాయిలాండ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్.
  • 14
   రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ రెండు సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించకపోయినా.. వీళ్లిద్దరి కలిసి నటించడం ఫ్యాన్స్‌కు
  • 15
   పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్..పదిహేడేళ్ల సినీ కెరీర్‌లో ‘సాహో’ తో కలపి ఇప్పటి వరకు పందొమ్మిది సినిమాలు చేసాడు. హిందీలో అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘యాక్షన్ జాక్సన్’లో గెస్ట్ రోల్ చేసాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండే పాత్రలతో ప్రేక్షకుల మదిలో డార్లింగ్‌గా, ‘ఛత్రపతి’గా, ‘బాహుబలి’గా చెరగని ముద్రవేసాడు.
  • 16
   ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఈ హీరో తొలి హిందీ సినిమా బాహుబలి అని చాలామంది అనుకుంటారు. కానీ బాహుబలి కంటే ముందు బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో నటించాడు ప్రభాస్. కాకపోతే అది గెస్ట్ రోల్ మాత్రమే.
  • 17
   ప్రభాస్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే, ఇతడు హీరో అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. స్వతహాగా భోజనప్రియుడైన ఈ హీరో, మంచి హోటల్స్ పెడదాం అనుకున్నాడు. హోటల్ బిజినెస్ నే కెరీర్ గా మలుచుకుందామనుకున్నాడు. కానీ అనుకోకుండా హీరోగా మారాడు. అదే అతని కెరీర్ అయింది.
  • 18
   ప్రభాస్ కు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్, మటన్, రొయ్యలు అనే తేడాలేకుండా అన్ని రకాల బిర్యానీలు లాగించేస్తాడు. బాహుబలి షూటింగ్ టైమ్ లో ఛీట్ మీల్ సందర్భంగా ఏకంగా 15 రకాల బిర్యానీలు తెప్పించుకొని మరీ తిన్నాడు ఈ హీరో.
  • 19
   ప్రభాస్ ఫిజిక్ వెనక ఉన్న వ్యక్తి లక్ష్మణ్ రెడ్డి. ప్రభాస్ ట్రయినర్ ఇతడే. 2010లో లాస్ వెగాస్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేత ఇతడు. రీసెంట్ గా ఇతడికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్ తనకు ఇష్టమైన వ్యక్తులందర్నీ డార్లింగ్ అని పిలుస్తాడు. లక్ష్మణ్ ను కూడా అలానే పిలుస్తాడు.
  • 20
   హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత రాబర్ట్ డెనిరో అంటే ప్రభాస్ కు ఇష్టం. ఇక బాలీవుడ్ కు సంబంధించి రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు ఇష్టం. ఇక తన ఇంటికి ఎవరొచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపించడం ఇంకా ఇష్టం. ప్రభాస్ తో నటించిన హీరోయిన్లంతా అతడి ఆత్మీయత, ఆతిథ్యానికి ఫిదా అవుతారు. రకరకాల వంటకాల్ని ప్రత్యేకంగా తయారుచేయించి హీరోయిన్లకు స్వయంగా తనే వడ్డిస్తుంటాడు ప్రభాస్.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X