
ప్రభాస్
Actor
Born : 23 Oct 1979
Birth Place : hyderabad
ప్రభాస్ పూర్తి పేరు ' ఉప్పలపాటి ప్రభాస్ రాజు ', ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. 1979 అక్టోబరు 23 చెన్నెయ్ లో జన్మించారు. శివ కుమారి, సూర్యనారాయణా రాజు వీరి తల్లిదండ్రులు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను...
ReadMore
Famous For
ప్రభాస్ పూర్తి పేరు 'ఉప్పలపాటి ప్రభాస్ రాజు', ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. 1979 అక్టోబరు 23 చెన్నెయ్ లో జన్మించారు. శివ కుమారి, సూర్యనారాయణా రాజు వీరి తల్లిదండ్రులు.
అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు.
ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యాడు. చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటు ఒక స్థానం...
Read More
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన మహానటి డైరెక్టర్.. ఏకంగా రెండు అప్డేట్స్ అంటూ!
-
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
-
సలార్ రీమేక్ రూమర్స్.. అసలు నిజం తెలిసిపోయింది
-
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
-
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని కామెంట్స్: అప్పుడే జరుగుతుందని బాంబ్ పేల్చిన రెబెల్ స్టార్
-
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
-
11979 అక్టోబర్ 23న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తురులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. 2002లో కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
-
2‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ...2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్‌ను మలుపు తిప్పింది. హీరోగా ప్రభాస్‌కు మూడో సినిమా. ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.
-
3ఆ తర్వాత ‘అడవిరాముడు’, ‘చక్రం’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ‘చక్రం’ మూవీతో డిఫరెంట్ మూవీస్ చేయగలడు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రభాస్.
-
4ప్రభాస్ సినీ కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘చత్రపతి’. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ‘ఛత్రపతి’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. సెంటిమెంట్ ను కూడా అదే స్థాయిలో పండించి మెప్పించాడు ప్రభాస్. ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాతో ప్రభాస్ డైలాగ్ డెలివరీ పూర్తిగా మారిపోయింది.
-
5‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ విభిన్న పాత్రలను పోషించాడు. ‘పౌర్ణమి’లో క్లాస్ క్యారెక్టర్, ‘యోగి’లో మదర్ సెంటిమెంట్‌తో కలిపిన యాక్షన్, ‘మున్నా’లో వెరైటీ యాక్షన్, ‘బుజ్జిగాడు’లో ఫుల్ మాస్ క్యారెక్టర్‌తో పాటు కామెడీని పండించాడు.
-
6బిల్లా మూవీతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు ప్రభాస్. ఈ సినిమాలో డబుల్ రోల్ తో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. అండర్ వరల్డ్ డాన్ గా కనిపించాడు.
-
7మాస్ పాత్రలు మాత్రమే కాకుండా ‘డార్లింగ్’ వంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ లోని మాస్‌ను మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో.. ప్రభాస్‌లోని నటుడిని చూశారు.
-
8ఆ తర్వాత చేసిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు ప్రభాస్
-
9ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచిన మూవీ ‘మిర్చి’. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు. ఈ సినిమా లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
-
10తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన సినిమా ‘బాహుబలి’. ఇందులో బాహుబలిగా ప్రభాస్ యాక్షన్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగింది. రెబల్ స్టార్ పేరు హాలీవుడ్ వరకూ వెళ్లింది.
-
11ఇక బాహుబలి 2 పార్ట్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాడు.
-
12తాజాగాా ‘సాహో’ తో పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.
-
13ఇక బాహుబలితో వచ్చిన ఈ క్రేజ్ వల్లే థాయిలాండ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్.
-
14రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ రెండు సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించకపోయినా.. వీళ్లిద్దరి కలిసి నటించడం ఫ్యాన్స్‌కు
-
15పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్..పదిహేడేళ్ల సినీ కెరీర్లో ‘సాహో’ తో కలపి ఇప్పటి వరకు పందొమ్మిది సినిమాలు చేసాడు. హిందీలో అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘యాక్షన్ జాక్సన్’లో గెస్ట్ రోల్ చేసాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండే పాత్రలతో ప్రేక్షకుల మదిలో డార్లింగ్‌గా, ‘ఛత్రపతి’గా, ‘బాహుబలి’గా చెరగని ముద్రవేసాడు.
ప్రభాస్ వ్యాఖ్యలు