twitter
    CelebsbredcrumbRaju B AbredcrumbBiography

    రాజు బి ఎ బయోగ్రఫీ

    సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా బీఏ రాజు విజయవాడలో తన కెరీర్‌ను ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్టు మోహన్ కుమార్ వద్ద శిష్యరికం చేశారు. మోహన్ కుమార్ ప్రోత్సాహంతోనే ఆయన సినీ జర్నలిస్టుగా మారారు. 

    ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేశారు. 1994లో తన భార్య జయ.బి సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు బి ఏ రాజు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు, సాంకేతిక నిపుణులకు బి.ఎ. రాజు పి.ఆర్. ఓ.గా పని చేశారు. అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన బి.ఏ. రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు.

    దాదాపు 35 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగారు. సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. కృష్ణతోపాటు మహేష్ బాబు కూడా అభిమానిగా మారారు. సినీయర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో మంచి అనుబంధం ఉంది. కృష్ణ కుటుంబంలోని హీరోల సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు.

    కృష్ణ అభిమానిగానే కాకుండా పీఆర్వోగా ఆయనకు ఆపారమైన అనుబంధం ఉంది. 1987 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1000కిపైగా చిత్రాలకు పీఆర్వోగా వ్యవహరించారు. ప్రస్తుతం అఖండ, నారప్ప, సర్కారు వారీ పాట, పెళ్లి సందడి, సీటీమార్, శాకుంతలం సినిమాలకు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.

    చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ. బి దర్శకత్వంలో ‘ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం’ వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. బి.ఎ. రాజు తనయుడు అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వి ఎఫ్ ఎక్స్ నిపుణుడు. మరో కుమారుడు శివ కుమార్… ప్రస్తుతం ’22’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

    ఫిలిం జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించిన బీఏ రాజు ‘చంటిగాడు' అనే సినిమాతో నిర్మాతగానూ మారారు. దీని తర్వాత ‘ప్రేమికులు', ‘గుండమ్మ గారి మనవడు', ‘లవ్‌లీ', ‘సవాల్', ‘వైశాఖం' అనే సినిమాలను చేశారు. ఇందులో ఎక్కువగా ఆయన భార్య ప్రముఖ దర్శకురాలు జయ తెరకెక్కించిన చిత్రాలే ఉన్నాయి.

    సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన బీఏ రాజు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు పీఆర్వోగా పనిచేశారు. సూపర్ హిట్ అనే మ్యాగజైన్‌ ద్వారా బిఏ రాజు అటు సినీ పరిశ్రమకు ఇటు సినీ ప్రేమికులకు మధ్య వారధిగా నిలిచారు. మహేశ్ బాబు పీఆర్ఓగా పని చేశారు. సూపర్ స్టార్‌తో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జునతో పాటు ఎంతో మంది సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి పని చేశారాయన.

    బీఏ రాజు భార్య జయ ఆగస్టు 30, 2018 తేదీన మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ దర్శకత్వం బాధ్యతలు ఇటీవలే చేపట్టారు. ఆయన రూపొందించిన చిత్రం విడుదల కావాల్సి ఉంది.  బి ఏ రాజు (61) 22/05/2021 శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X