twitter
    CelebsbredcrumbRallapallibredcrumbBiography

    రాళ్ళపల్లి బయోగ్రఫీ

    1945లో తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించిన రాళ్ళపల్లి.. పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. "కుక్కకాటుకు చెప్పుదెబ్బ" అనే చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. 'ఊరుమ్మడి బతుకులు' అనే చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. నాటకరంగంలో విశేష అనుభవం ఉండడంతో ఆయనకు చిత్రసీమలో ఎదురులేకుండా పోయింది.

    రాళ్లపల్లి తన సినీ కెరీర్‌లో సుమారు 850కి పైగా చిత్రాల్లో నటించారు. జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్‌, నావికుడు... ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. నటనలో ఆయనకంటూ ఒక సొంత శైలి ఉంది. ఆయన చివరగా నటించిన చిత్రం మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన "భలేభలే మగాడివోయ్" చిత్రం. ఆపై వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యారు.

    తెలుగు సినీ ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకుపైగా ఆకట్టుకొన్న రాళ్లపల్లి. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ 17/5/2019న  తుదిశ్వాస విడిచారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X