రామ్ గోపాల్ వర్మ బయోగ్రఫీ

    రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ, క్షణ క్షణం, రంగీలా, సత్య,కంపెనీ, మరియు భూత్. కథ, స్క్రీన్ ప్లే,కూర్పు, దర్శకుడు & నిర్మాత ఇలా సినిమాలోని పలు రకాల పనులను చేపట్టారు. నిజ జీవితానికి దగ్గరగా వున్న కథలను ఎంచుకున్నారు. 


    క్షణ క్షణం, గోవిందా గోవిందా, గాయం, దేశం, మని మనీ, గులాబి వంటి హిట్ సినిమాలు తీసారు. వర్మ తన సొంత సినిమా నిర్మాణసంస్థ వర్మ కార్పోరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ, మనీ మనీ, గులాబి, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒక రోజు, దెయ్యం  అనే తెలుగు సినిమాలను నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు మరియు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ తరువాత టాలీవుడ్ లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు
    రామ్ గోపాల్ వర్మ 1962లో విజయవాడ నగరంలో కృష్ణంరాజు మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించారు. నగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది.


    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డును రామ్ గోపాల్ వర్మ మూడుసార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ, క్షణ క్షణం మరియు ప్రేమకథ చిత్రాలకు గెలుచుకున్నారు. సత్య' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడి అవార్డును గెల్చుకున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X