రమ్య కృష్ణన్ బయోగ్రఫీ

  రమ్యకృష్ణ ఒక భారతీయ సినీ నటి. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. యుక్తవయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. రమ్య ప్రముఖ నటులందరి సరసన నటించింది. 1985లో  ఇద్దరు మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయిన ఈమెకి చాలా కాలం సరయిన అవకాశాలు లేవు. 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె నటజీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు విజయం లభిస్తుంది అనేంత నమ్మకాన్ని నిర్మాతలకు కలిగించాయి. 1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘బాల మిత్రులు’ 1987లో విడుదల అయింది. కె. రాఘంద్రేరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక చందమామలా వెలుగు వెలిగింది. దాదాపుగా తెలుగుహీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలున్నాయి.

  రజినీకాంత్తో నరసింహ చిత్రంలో పోటీపడి మరీ చేసిన 'నీలాంబరి' పాత్రను రక్తి కట్టించింది. ఈ సినిమా భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ.. న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X