twitter
    CelebsbredcrumbSanghavibredcrumbBiography

    సంఘవి బయోగ్రఫీ

    సంఘవి భారతీయ సినీ నటి.. నాన్నగారు డాక్టర్‌ డి. ఏ. రమేష్‌. మైసూర్‌ మెడికల్‌ కాలేజీ హెచ.ఓడి. అమ్మ రంజన.  ఒక తమ్ముడు నృపతుంగ రమేష్‌.  పెద్దమ్మ ప్రముఖ సినీ నటి ఆరతి.

     
    రెండు దశాబ్దాలుగా దక్షిణాది భాషలతో సహా హిందీలో కూడా 100 చిత్రాల్లో నటించారు. సిందూరం చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పొందిన ఉత్తమ నటి. ఎన్‌.టి.ఆర్‌, ఏ.ఎన్‌.ఆర్‌ కుటుంబాల్లోని నటులతో కలిసి నటించే అవకాశం తనకు లభించిందనీ, అది అందరికీ దక్కే అవకాశంకాదనీ అంటారామె.
     
    చదువు
    ఏడవ తరగతి వరకు మైసూర్‌లోనే చదువు కున్నాను. తర్వాత రెండేళ్ళూ మరిమలప్పా ఉన్నత పాఠ శాలలో చదివాను. 90 శాతం పైగా ఉత్తీర్ణతా శాతం ఉన్నవారిని మాత్రమే చేర్చుకోవడం ఈ పాఠశాల ప్రత్యే కత. అయినాకూడా అక్కడ సీటు లభించడం చాలా కష్టం. అంత ఉత్తీర్ణతా శాతం ఉన్నతర్వాత కూడా మళ్ళీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 98 శాతం మార్కు లతో పాసైనా గానీ నైన్త్‌ వరకు మాత్రమే నేను అక్కడ చదవ గలిగాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, చదువు విషయంలో ఎందుకు అంత అశ్రద్ధ చేశానా అని.

    తెలుగులో తొలి చిత్రం
    తెలుగులో నా తొలి చిత్రం ‘తాజ్‌ మహల్‌’. విజయ వంతమైన చిత్రం. నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. ఇందులో నాది మేజర్‌ పాత్ర. శ్రీకాంత్ హీరో. మోనికాబేడి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం నటిం చారు. శ్రీకాంత నటించిన సూపర్‌హిట్‌ తొలిచిత్ర మిదే. ముప్పలనేని శివ దర్శకత్వంలో రామానాయుడు గారు 1995లో నిర్మించారు.
     
    నంది అవార్డు
    1997లో వచ్చిన ‘సిందూరం’ నా కెరీర్‌లో నంది అవార్డు చిత్రం. కృష్ణవంశీ దర్శకత్వం. ఉత్తమ నటిగా నాకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సత్క రించింది. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. నేను, రవితేజ హీరో హీరోయిన్లు. బ్రహ్మాజీ మేజర్‌ రోల్‌.
     
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X