సిరివెన్నేల బయోగ్రఫీ

  సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు మార్చుకున్నారు.
  స్వయంకృషిలోని పాటలన్ని సిరివెన్నెల రాయడం విశేషం. అందులొ "విధాత తలఁపున ప్రభవించినది..." అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు. రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈ రేయినీ, జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియ కమలం విరిసినదీ....స్వర్ణకమలంలోని అన్ని పాటలు - ముఖ్యంగా : 'ఆకాశంలో ఆశల హరివిల్లూ ; 'అందెల రవమిదీ.... ఇలాంటి మరిన్నో పాటలు రాశారు సిరివెన్నెల గారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X