twitter

    శోభన్ బాబు బయోగ్రఫీ

    శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. తెలుగులొ ఎక్కువ ప్రేక్షకుల ఆదరాభిమానాలున్న వ్యక్తి.  తెలుగు సినిమా కథా నాయకుడు. ఎక్కువగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో నటించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
    మద్రాసులో చదువుతున్నప్పుడు నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఈ సినిమా విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు.  అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు. గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథ,  ప్రతిజ్ఞా పాలన వంటి కొన్ని సినిమాలలో నటించారు. ఆ కాలంలో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడుగా భీష్మలో,సీతారామకల్యాణంలో లక్ష్మణుడుగా , బుద్ధిమంతుడులో కృష్ణునిగా. సహాయ పాత్రలు  చేసినప్పుడు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబుకు ఎంతో సహాయం చేశారని చెప్పాడు.
    శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనతొ మెప్పించాడు. మొదటలొ హీరోగా నటించిన సినిమాలు అంత విజయవంతం కాలేదు. పొట్టి ప్లీడరు సినిమా విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడలేదు అయినప్పటికి శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చింది. బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది.  మనుషులు మారాలి చిత్రం సిల్వర్ జూబిలీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయి. ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల విజయవంతమవడంతో అగ్ర నటులులొ ఒక్కడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
    మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ సినిమాలు కూడా నటించింగలడు అని చాటిచెప్పాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన కృష్ణునిగా బుద్ధిమంతుడు సినిమాలోను, రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోను నటించాడు. ఆపాటికే ఈ పాత్రలలో ఎన్టీయార్ తన ముద్ర వేసుకున్నప్పటికి ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X