శ్రీనివాస్ అవసరాల బయోగ్రఫీ

  శ్రీనివాస్ అవసరాల భారతీయ నటుడు, దర్శకుడు, సినిమా స్క్రిప్ట్ రచయిత. 1984 మార్చ్ 19న జన్మించారు.  హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ కొద్ది రోజులు విజయవాడ, కొత్త ఢిల్లీ, చెన్నై, కోల్కతాలలో నివసించారు. శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసారు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలసిస్ విషయంలో ప్రిన్స్‍టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో పనిచేసారు.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్ నుండి స్క్రీన్ రైటింగ్ లో డిప్లోమా పొందారు.

  యూనివర్సల్ స్టూడియోస్ వద్ద స్క్రిప్ట్ స్క్రీనర్ గా పనిచేసారు. అష్టా-చమ్మా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద అనే ప్రేమ-హాస్య కథా చిత్రాలకు  దర్శకత్వం వహించారు. చాలా సినిమాల్లో సహయ పాత్రలో మరియు కథానాయకుడిగా  నటించారు. 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X