తమన్నా భాటియా 1989 డిసెంబరు 21ముంబైలో జన్నించింది. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజిని భాటియా. తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో నటించే ఓ భారతీయ నటి, మోడల్, నృత్యకారిణి. తమన్నా ముఖ్యంగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించింది.
తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. మొదటలో విఫలమైనా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి.
2009లో కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు సాధించిన తమన్నా ఆపై ఊసరవెల్లి (2011), రచ్చ (2012), కెమెరామెన్ గంగతో రాంబాబు (2012), తడాఖా (2013) వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆపై హిమ్మత్‍వాలా చిత్రం ద్వారా తిరిగి హిందీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విఫలమైనా తమన్నాకి మరెన్నో హిందీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.
టాలీవుడ్ లో నటులు రాం చరణ్ తేజ, రామ్, ప్రభాస్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితర నటులతో నటించింది,