తనికెళ్ల భరణి
Born on 14 Jul 1956 (Age 64)
తనికెళ్ల భరణి బయోగ్రఫీ
తనికెళ్ళ భరణి భారతీయ సినీ నటుడు, సినిమా రచయిత, తెలుగు భాషాభిమాని. జులై 14, 1956న పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురంలో జన్మించారు .
తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు మరియు పరదేశి చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటన ప్రదర్శించాడు. కామెడీ,విలన్ మరియు ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రదారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకడయ్యాడు. ఆయన దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో నటించాడు.