twitter
    CelebsbredcrumbTrisha KrishnanbredcrumbUnknown Facts

    Unknown Facts

    • 1
      దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో త్రిష ఒకరు.
    • 2
      తమిళనాడుకు చెందిన ఈమె.. క్రిమినల్ సైకాలజీలో పట్టా అందుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగెట్టింది. అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది.
    • 3
      ఆ తర్వాత జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుంది.
    • 4
      మోడలింగ్‌లో సత్తా చాటిన త్రిష.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పదహారేళ్ల వయసులోనే ‘జోడీ' అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది.
    • 5
      యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష నియమితురాలైన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్‌ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్‌ టీకా ఆవశ్యకతపై యాడ్‌ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్‌ తరఫున తమిళనాడు, కేరళ చిన్నారుల హక్కుల రాయబారిగా ఆమెను నియమించింది.
    • 6
      తరుణ్ నటించిన 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు.. రెండో చిత్రం 'వర్షం'తో మొదటి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె చేసిన నటనకు ఎన్నో అవార్డులు, అవకాశాలు దక్కాయి.
    • 7
      ఆ తర్వాత పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈమె.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డులకు కూడా ఎక్కింది.
    • 8
      ఈ మధ్య తమిళ సినిమాలకే పరిమితం అయిపోయిన త్రిష.. వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాల్లో తనదైన మార్క్ చూపించింది
    • 9
      చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది త్రిష. ఈ క్రమంలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'లో అవకాశం వచ్చింది. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా నుంచి తప్పుకుందామె. దీంతో మెగా ఫ్యాన్స్ త్రిషపై ఫైర్ అయ్యారు. ఇక్కడ సినిమాలు చేయకున్నా.. ఆమె తమిళంలో పలు సినిమాలు ఒప్పుకుని ముందుకు సాగుతోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X