twitter

    వెన్నెల కిషోర్ బయోగ్రఫీ

    వెన్నెల కిషోర్ఒక తెలుగు సినీ నటుడు మరియు దర్శకుడు. మొదటలో ఇతను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కిశోర్ ది నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో ఓ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లక్ష్మీ నారాయణ ఆంగ్ల టీచర్. భార్య పద్మజ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. 


    'వెన్నెల కిషోర్' దర్శకత్వంలో రూపొందిన 'వెన్నెల 1 1/2' చిత్రం పరాజయం అయ్యింది. కొన్ని సంవత్సరాల తరువాత సినిమాలొ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇంకోస్సారి సినిమాకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. దుకుడు, లవ్లీ, జులాయి, నాన్నకు ప్రేమతో, ఛలో వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. వెన్నెల 1 1/2, జెఫా చిత్రాలకి దర్శకత్వం కూడ వహించారు.

    కొందరు తెరపై మాత్రమే హాస్యాన్ని పండిస్తారు. కానీ తెర వెనుక మహా కోపిష్ఠిలా ఉంటారు. ఇంకొంతమంది తెర వెనుక సరదాగా సందడి చేస్తున్నా.. తెరపైకి వచ్చేసరికి విపరీతమైన కోపాన్ని నటిస్తారు. అయితే కొంతమంది మాత్రమే.. తెర ముందు.. తెర వెనకాల ఒకేరకంగా ఉంటారు. అలాంటి వారిలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒకరు.

    ఒక్కప్పుడు బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్టు అని మాట్లాడుకునేవారు. ఆ తరువాత ఆ స్థానాన్ని సునీల్ కొంతకాలం ఆక్రమించాడు. కానీ హీరో కావాలన్న ఆశతో.. కాలక్రమంలో వెనకబడ్డాడు. ఇక ఇప్పుడు వెన్నెల కిషోర్ టైమ్ నడుస్తోంది.





     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X