విశాల్ కృష్ణ
Born on 29 Aug 1977 (Age 46) తమిళనాడు
విశాల్ కృష్ణ బయోగ్రఫీ
విశాల్ కృష్ణ రెడ్డి (విశాల్ అని పిలుస్తారు) ఒక భారతీయ సినీ నటుడు మరియు నిర్మాత. సినీ నిర్మాత జి. కె. రెడ్డి చిన్న కుమారుడు. రెడ్డి ప్రముఖ తమిళ & తెలుగు చిత్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్లో జన్మించినప్పటికీ తరువాత చెన్నైకి మారారు. విశాల్ తన పాఠశాల విద్యను డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్లో చేసాడు మరియు చెన్నైలోని లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పొందాడు.
తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విశాల్. ఆ తరువాత 2004లో చెల్లమే అనే సినిమాతో కథానాయుకునిగా తెరంగేట్రం చేసిన ఆయనకు సందకోళి, తిమిరు, సినిమాలతో విజయం అందుకున్నారు. తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండియ నాయుడు, నాన్ సిగప్పు మనిథన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు విశాల్.
అక్టోబరు 2015లో అంతకుముందు ఉన్న కమిటీపై ఆరోపణలు వచ్చాకా జరిగిన ఎన్నికల్లో నడిగర్ సంఘానికి విశాల్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
పందెం కోడి, భరణి, ప్రేమ చదరంగం, బయ్య, పోగరు, వాడు వీడు, పల్నాడు, ఇంద్రుడు వంటి మొదలగు సినిమా నుంచి తెలుగు లో విశాల్ కు మంచి ఫేరు వచ్చింది.
సంబంధిత వార్తలు