నాగార్జున 'కింగ్-100'లో బిగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ హీరోయిన్!

Nagarjuna's King 100 Twist: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైల్‌స్టోన్ మూవీ 'కింగ్ 100'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read
ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్
ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్

28ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్-టబు కాంబినేషన్
నాగార్జున-టబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.'నిన్నే పెళ్లాడతా' వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో పాటు 'ఆవిడా మా ఆవిడే' వంటి సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికీ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అందుకే చాలా కాలం తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటించబోతున్నారట. ఈ వార్త బయటకు రాగానే అభిమానులు మరోసారి రొమాంటిక్ మ్యాజిక్‌ను చూడబోతున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Nagarjuna s King100 Twist Tabu to Play a Powerful Villain After 28 Years

అయితే తాజాగా వస్తున్న వార్తలు మాత్రం అందరి అంచనాలను పూర్తిగా మార్చేశాయి. ఈ సినిమాలో టబు హీరోయిన్‌గా కాకుండా పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రధాన ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Recommended For You
 Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?

నాగార్జునకు ఎదురెళ్లే లేడీ విలన్?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. టబు పాత్ర ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందట. సాధారణ విలన్ పాత్ర కాదు.. కథను పూర్తిగా మలుపుతిప్పే, హీరోకు సమానంగా నిలిచే పవర్ పుల్ రోల్ లో నటించబోతున్నట్టు టాక్. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్, ఎమోషనల్, క్లాస్ పాత్రల్లో మెప్పించిన టబు.. ఈసారి పూర్తిస్థాయి నెగెటివ్ షేడ్స్‌తో కనిపిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పాత్రకు సంబంధించి ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే కావడంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని ధృవీకరించడం సాధ్యం కాదు.

You May Also Like
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ఎమోషన్, యాక్షన్ కలయికగా 'కింగ్ 100'
ఈ సినిమా కథ .. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎదిగే ప్రయాణం చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయి ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమాలో తండ్రి-కూతుళ్ల అనుబంధం కథకు ప్రధాన బలంగా నిలుస్తుందనే సమాచారం వినిపిస్తోంది.ఇప్పటికే షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగాన్ని త్వరలో పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్
Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్

జూలై 10 తర్వాత అధికారిక ప్రకటన?
ఇటీవల అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున తన 100వ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూలై 10 తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలను వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. టైటిల్, ఫస్ట్ లుక్, నటీనటుల పూర్తి వివరాలు, విడుదల తేదీతో పాటు టబు పాత్రపై వస్తున్న ప్రచారానికి కూడా అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే టబు నిజంగానే ప్రతినాయకురాలి పాత్రలో నటిస్తుందా? లేక ఇది కేవలం ప్రచారమేనా? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం మూవీ మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన రానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X