Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?

Nagabandham Collections: యువ కథానాయకుడు విరాట్ కర్ణ, దర్శకుడిగా మారిన అభిషేక్ నామా కాంబోలో తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'నాగబంధం: ద సీక్రెట్ ట్రెజర్'(Nagabandham). ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ, విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఎంత కలెక్ట్ చేసింది? నాలుగో రోజు మూవీ అంచనా కలెక్షన్లు ఎంతంటే?

Also Read
Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్
Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్

విడుదలకు నాగబంధంపై మంచి అంచనాలు నెలకొనడంతో థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడిని తిరిగి రాబట్టుకుని లాభాల్లోకి వెళ్లాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.65 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం.

Nagabandham Day 4 Expected Box Office Collection Budget Break-Even Worldwide Report
Recommended For You
NTR Trivikram Movie: చూస్తూ ఊరుకోం.. ప్రారంభానికి ముందే వివాదం..
NTR Trivikram Movie: చూస్తూ ఊరుకోం.. ప్రారంభానికి ముందే వివాదం..

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకి రూ.27 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇందులో నైజాం రూ.9 కోట్లు, ఆంధ్రా రూ.14 కోట్లు, సీడెడ్ రూ.4 కోట్లు విలువైన హక్కులు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా కర్ణాటకలో రూ.2.7 కోట్లు, తమిళనాడులో రూ.70 లక్షలకు రైట్స్ అమ్ముడుబోయినట్టు సమాచారం. ఇక నార్త్ ఇండియా,నార్త్ అమెరికా, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ కమిషన్ బేస్డ్ పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందాలంటే రూ.65 కోట్ల షేర్ సాధించడం తప్పనిసరి.

You May Also Like
Allu Arjun rejected movies: అల్లు అర్జున్ వదిలిస్తే బ్లాక్‌బస్టరేనా? ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు కలిస్తుందా?
Allu Arjun rejected movies: అల్లు అర్జున్ వదిలిస్తే బ్లాక్‌బస్టరేనా? ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు కలిస్తుందా?

విడుదలైన తొలి రోజు (శుక్రవారం) సినిమా రూ.3.40 కోట్ల నెట్ వసూలు చేసింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ పరంగా సినిమా ఫర్వాలేదనిపించింది. రెండో రోజు (శనివారం) కలెక్షన్లు స్వల్పంగా తగ్గాయి. రూ.3.05 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే భారీ డ్రాప్ లేకపోవడం ట్రేడ్ వర్గాలకు ఊరటనిచ్చింది. ఇక ఆదివారం సినిమా కలెక్షన్లు మళ్లీ పుంజుకుంది. మూడో రోజు (ఆదివారం) ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.3.65 కోట్ల నెట్ వసూలు చేసి తొలి రెండు రోజుల కంటే మెరుగైన వసూళ్లు నమోదు చేసింది.

భాషల వారీగా చూస్తే, తెలుగు వెర్షన్ లో అత్యధిక వసూళ్లు సాధించింది. తెలుగు నుంచి రూ.2.90 కోట్ల నెట్ రాగా, హిందీ వెర్షన్ లో రూ.0.60 కోట్లు, తమిళం రూ.10 లక్షలు, కన్నడ లో రూ.3 లక్షలు, మలయాళంలో 2 లక్షల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. దీంతో తొలి మూడు రోజుల్లో సినిమా రూ.10.10కోట్ల ఇండియా నెట్ అందుకోగా, రూ.11.65 కోట్ల ఇండియా గ్రాస్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది.

అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!
అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!

ఇక దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ సినిమాకు పరిమిత స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుంది. మూడు రోజుల్లో ఓవర్సీస్ నుంచి రూ.1.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.₹12.90 కోట్లకు చేరుకున్నాయి.

OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

నాలుగో రోజు అంచనా కలెక్షన్లు
ఇక అసలు పరీక్ష సోమవారం నుంచే మొదలైందనే చెప్పాలి. వీక్‌డేస్‌లో సినిమా ఎంతవరకు హోల్డ్ అవుతుందనే దానిపైనే దీర్ఘకాలిక బాక్సాఫీస్ ప్రయాణం ఆధారపడి ఉంటుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సోమవారం షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ పరిమిత స్థాయిలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిశ్రమ టాక్ మధ్య కూడా సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయే అవకాశముందని భావిస్తున్నారు. సోమవారం నాడు దేశవ్యాప్తంగా రూ. 2 కోట్లు వరకు కలెక్షన్లు అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 50 లక్షలు కలెక్షన్లు అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజులు బాక్సాఫీస్ ప్రయాణం ఎలా సాగుతుందో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X