ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్

అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా 'లెనిన్'. ఈ సినిమాను దర్శకుడు నందు (మురళీ కిషోర్ అబ్బూరు)తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి తిరుపతిలో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు. సందర్భంగా అఖిల్ పై నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
Nagabandham Day 3 Collections: వీకెండ్‌లో పుంజుకున్న 'నాగబంధం' కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 3 Collections: వీకెండ్‌లో పుంజుకున్న 'నాగబంధం' కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?

నాగార్జున ముందుగా దర్శకుడు నందు గురించి మాట్లాడారు. ఈ సినిమా కథ మొదటిసారి విన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. "నందు నా దగ్గరకు వచ్చి కథ చెప్పే ముందు.. ఈ సినిమా 'శ్రీరామపురం'లో జరుగుతుందని చెప్పాడు. వెంటనే నేను ఏ శ్రీరామపురం అని అడిగాను. అది మా నాన్న పుట్టిన ఊరు కాదు. చిత్తూరు జిల్లా శ్రీరామపురం అని చెప్పాడు. అయినా 'శ్రీరామపురం' అనే పేరుకే నాకు ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. అందుకే వెంటనే కథ చెప్పమన్నాను" అని తెలిపారు.

Nagarjuna on Akhil s Lenin

కథ వినడం ప్రారంభించిన తర్వాత తాను పూర్తిగా దానిలో లీనమైపోయానని నాగార్జున చెప్పారు. "నందు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇందులో ఎన్నో విభిన్నమైన పాత్రలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులు అస్సలు ఊహించలేరు. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే.. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు మరో స్థాయిలో ఉంటాయి. ప్రతి ట్విస్ట్ కథను కొత్త మలుపు తిప్పుతుంది" అని సినిమాపై అంచనాలు పెంచేశారు.

Recommended For You
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

"ప్రపంచంలో ప్రేమ కంటే గొప్ప ఎమోషన్ మరొకటి లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి.. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అలాంటి గొప్ప ప్రేమ కథ కూడా 'లెనిన్'లో ఉంది" అని చెప్పారు. "ఇది ఈ సీమ కదా. సీమ మట్టి కథ, సీమలోని మనుషుల కథ. సీమలో జరుగుతున్న మహాభారతం. అటువంటి కథ ఇది. ఇప్పటివరకు అఖిల్ అన్ని అర్బన్ ఫిలిమ్స్ చేశాడు. ఈ కథలో సరిపోతాడా? ఈ సినిమాకు సరైన న్యాయం చేయగలుగుతాడా? అనే భయం నాకు వేసింది'అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

You May Also Like
ఆ సినిమా వల్ల భారీ నష్టం.. అన్నపూర్ణ పక్కన అర ఎకరం అమ్మేశా: రాజేంద్రప్రసాద్
ఆ సినిమా వల్ల భారీ నష్టం.. అన్నపూర్ణ పక్కన అర ఎకరం అమ్మేశా: రాజేంద్రప్రసాద్

అయితే సినిమా పూర్తిగా చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని నాగార్జున అన్నారు. ' సినిమా చూసిన తర్వాత నేను కాదు.. మూవీ టీం మొత్తం ఆశ్చర్యపోయారు. నిజంగా అఖిల్ లెనిన్ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత.. లెనిన్ స్నేహాన్ని ఇష్టపడతారు. లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు.. లెనిన్ పగను కూడా అర్థం చేసుకుంటారు. లెనిన్ ను మీరు ఇంటికి తీసుకువెళ్తారు. మీకు సినిమాలో అఖిల్ కనిపించడు. లెనిన్ పాత్ర మాత్రమే మీకు కనిపిస్తుంది'అని ప్రశంసలు కురిపించారు.

NTR Trivikram Movie: చూస్తూ ఊరుకోం.. ప్రారంభానికి ముందే వివాదం..
NTR Trivikram Movie: చూస్తూ ఊరుకోం.. ప్రారంభానికి ముందే వివాదం..

చివరగా అభిమానులను ఉద్దేశించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "జూలై 10న 'లెనిన్'తో మీ ముందుకు వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు 'అని అన్నారు. నాగార్జున కామెంట్స్ 'లెనిన్'పై అంచనాలు మరింత పెరిగాయి. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా కీలక మలుపు అవుతుందనే అభిప్రాయాలు ఇప్పటికే సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో జూలై 10న తేలనుంది.

Read more about: nagarjuna akhil akkineni lenin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X