Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్
Bandla Ganesh vs Prakash Raj: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావణ్ అరెస్ట్ తీవ్ర చర్చనీయంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కొత్త కేసులు నమోదు చేస్తూ మళ్లీ అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వరుసగా స్పందిస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ.. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బండ్ల గణేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘాటైన వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ చేశారు. "రాత్రి తాగుతావు... పొద్దున్నే వాగుతావు... అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు... ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ పోస్ట్‌లో ఎవరి పేరును బండ్ల గణేశ్ ప్రస్తావించలేదు. అయితే ఇటీవల ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై ప్రకాశ్ రాజ్ వరుసగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు విడుదల చేస్తున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఓ వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. "అసలు ఏం జరుగుతోంది? నాలుగు సార్లు వరుసగా తప్పుడు కేసులు పెట్టి, కోర్టు బెయిల్ ఇస్తే వెంటనే యూఏపీఏ పెట్టి ఒక యూట్యూబర్‌ను రిమాండ్‌కు పంపిస్తారా? అంటే అధికారాన్ని ప్రశ్నిస్తే అది దేశద్రోహమా? ఇది ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి చేస్తున్న కుట్ర అని అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది"అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా, ప్రశ్న రావణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు."తర్వాత ఏం చేస్తారు? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు వీడియోలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన ఫోన్ మీ దగ్గర ఉంది. అందులోని వ్యక్తిగత సమాచారాన్ని వక్రీకరించి బయటకు లీక్ చేసి, ఆయనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తారా? ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వారిని, ప్రశ్నించే ప్రతి గొంతును భయపెట్టాలనుకుంటున్నారా?"అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.."దిగజారండి.. ఇంకా దిగజారుతూ ఉండండి. ఎంత కిందికి దిగజారుతారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. అధికార బలం శాశ్వతం కాదు. ప్రజలే చివరికి తీర్పు చెబుతారు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు పేరును కూడా ప్రస్తావిస్తూ.. "ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు గారితో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకు ముగింపు మాత్రం ప్రజలే ఇస్తారు. ఆట ఇప్పుడే మొదలైంది" అంటూ హెచ్చరించారు.
ఇదిల ా ఉంటే.. తాజాగా రావణ్‌కు బెయిల్ లభించిన అనంతరం, పోలీసులు యూఏపీఏ (UAPA)కింద కొత్త కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనకు 18 రోజుల రిమాండ్ విధించింది.


Click it and Unblock the Notifications





