సినిమాలకు అవికా గోర్ గుడ్‌బై? చిన్నారి పెళ్లికూతురు రియాక్షన్ ఇదే..

చిత్ర పరిశ్రమలో పరిస్ధితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. స్టార్‌డమ్ అనుభవించిన వారు ఊహించని విధంగా అధ:పాతాళానికి పడిపోతారు. పూలుపడిన చోటే రాళ్లు పడుతుంటాయి. కొందరికి విజయం అంత తేలికగా లభించదు.. మరికొందరికి సక్సెస్ దొరికినా చివరి వరకు కంటిన్యూ చేయలేరు. అన్నింటిని తట్టుకుని నిలబడిన వారే చివరికి విజేతగా నిలుస్తారు. కానీ కొందరు మాత్రం ఈ ప్రయాణం నుంచి మధ్యలోనే తప్పుకుంటారు. తాజాగా హీరోయిన్ అవికా గోర్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారారు గుజరాతీ ముద్దుగుమ్మ అవికా గోర్. ఆ తర్వాత ససురాల్ సిమర్ కా, లాడో వీర్పూర్ కి మర్దని తదితర సీరియల్స్‌తో సత్తా చాటింది అవిక. సెలబ్రిటీ స్టేటస్ దక్కినప్పటికీ తను అనుకున్న విధంగా చదువుకోలేకపోయానని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో హైస్కూల్ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేసిన అవిక.. మాస్ కమ్యూనికేషన్‌లో లేదా ఫిల్మ్ మేకింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేయాలని భావించారు. కానీ సినీ, బుల్లితెర రంగంలో బిజీ కావడంతో కెరీర్‌పైనే దృష్టి పెట్టారు.

Is Avika Gor Retiring from Films Actress Hints at TV Comeback with Cryptic Post

పెరిగి పెద్దయిన తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు అవికా. 2013లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కథానాయికగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ఈ చిన్నారి పెళ్లికూతురు. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, నెట్, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ, పాప్‌కార్నర్, ఉమాపతి, షణ్ముఖ, అగ్లీ స్టోరీ వంటి వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు అవికా.

Recommended For You
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ
The India Story Movie Twitter Review: ది ఇండియా స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్‌తో పాటు హిందీ, కన్నడ, కజక్ భాషలలో పలు చిత్రాలలో నటించింది. అలాగే పాప్‌కార్న్ సినిమాకు నిర్మాతగానూ మారింది. మీడియం రేంజ్ హీరోలతో తప్పించి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నటుడు, వ్యాపారవేత్త మిళింద్ చద్వానీతో ప్రేమలో పడిన అవికా గోర్.. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట 2025 సెప్టెంబర్ 30న ఓ హిందీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకుని షాకిచ్చింది. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేకుండా టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడంపై అవికాపై ట్రోలింగ్ జరిగింది. దీనికి ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

You May Also Like
షూటింగ్‌లో విషాదం.. ఆ న్యూస్‌తో హృదయం ముక్కలు.. తనూజ కంటతడి
షూటింగ్‌లో విషాదం.. ఆ న్యూస్‌తో హృదయం ముక్కలు.. తనూజ కంటతడి

ఇటీవల భర్తతో కలిసి ఆమె భారతదేశాన్ని వదిలి బ్యాంకాక్‌లో స్థిరపడుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. విదేశాల్లో ఉన్నప్పటికీ నటిగా కొనసాగుతానని, షూటింగ్స్‌లో పాల్గొంటానని చెప్పింది. అయితే అవికా గోర్ హీరోయిన్‌గా రిటైర్ కానున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. తిరిగి బుల్లితెరపై ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారని కూడా బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ముంబైలోని ఎస్‌జే స్టూడియోకి వెళ్లడంతో ఇది నిజమేనని అభిమానులు కూడా భావించారు.

సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?
సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?

తాజాగా ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికే చేరుకోవడం ఆనందంగా ఉంది. కొత్త మార్గాల్లో జర్నీని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాం.. కానీ జీవితం అప్పుడప్పుడూ మూలల వైపుకు తీసుకెళ్తుంది. అలాగని ఇది వెనకడుగు వేసినట్లు కాదని.. కొత్తగా దానిని అర్ధం చేసుకునేలా ఎదిగామని అవికా గోర్ రాసుకొచ్చారు. దీంతో ఆమె బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని పరోక్షంగా తెలిపారు. అయితే హీరోయిన్‌గా అవికా ఇక నటించరా? పూర్తిగా బుల్లితెరకే అంకితమవుతారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more about: avika gor movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X