నా శరీరాన్ని అలా చూపించొద్దు... బాలయ్య హీరోయిన్ ఫైర్, ఏం జరిగిందంటే?
ప్రస్తుతం నటీనటులు తమ ప్రైవసీ, హక్కుల కోసం గట్టిగా నిలబడుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా రాకతో ఎక్కడా తమ హక్కులకు భంగం కలగరాదని కోర్టులను ఆశ్రయించి ప్రత్యేకంగా ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. అలాగే సినిమాలలో తమను చూపించే విధానంపైనా హీరోయిన్లు అగ్రిమెంట్ సమయంలో క్లియర్ కట్‌గా రూల్స్ చెబుతున్నారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అందాలను చూపించిన విధానంపై తెలుగు రాష్ట్రాలను దాటి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా తనను మీడియా ప్రతినిధులు అసభ్యంగా చూపిస్తున్నారంటూ ఓ హీరోయిన్ ఫైరయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే...
ఆ నటి ఎవరో కాదు.. నేహా ధూపియా. మిస్ ఇండియా కిరీటం అందుకుని టాప్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుని అనంతరం సినీరంగ ప్రవేశం చేశారు నేహా. తెలుగులో తరుణ్ హీరోగా వచ్చిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టారు నేహా ధూపియా. అనంతరం కయామత్: సిటీ అండర్ థ్రెట్ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. క్యా కూల్ హై హమ్, చుప్ చుప్ కే, ఏక్ చాలిస్ కీ లాస్ట్ లోకల్, సింగ్ ఈజ్ కింగ్, ది దానా దాన్, తుమ్హరి సులు, ఏ థర్స్‌డే మూవీలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ నేహా ధూపియా అలరించారు. తెలుగులో నిన్నేఇష్టపడ్డాను, విలన్, పరమ వీర చక్ర సినిమాలలో నటించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై పలు షోకు గెస్ట్‌గా, న్యాయ నిర్ణేతగా ఆకట్టుకున్నారు నేహా ధూపియా.

బాలీవుడ్ నటుడు అంగద్ బేడీతో ప్రేమలో పడి ఆయనతో డేటింగ్ చేశారు. కానీ ఈ జంట తమ బంధాన్ని సీక్రెట్‌గానే ఉంచింది. అయితే అనూహ్యంగా ఓ రోజున నేహా - అంగద్‌ల పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. పెళ్లయిన 6 నెలలకే నేహా ధూపియా.. ఆడపిల్లకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. దాంతో పెళ్లికి ముందే నేహా ప్రెగ్నెంట్ అయ్యారంటూ విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ నేహా మీడియాను ధీటుగా ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారు. అనంతరం 2021లో నేహా మరోసారి గర్భం దాల్చారు. 2021 అక్టోబర్ 3న ఈమెకు గురిఖ్ సింగ్ ధూపియా బేడీ అనే కుమారుడు జన్మించాడు.
సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ నేహా ధూపియా ముందుంటున్నారు. కన్‌సర్న్ ఇండియా ఫౌండేషన్ కోసం ముంబై మారథాన్‌లో పరిగెత్తి 5 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. అలాగే 2011లో సిక్కిం భూకంప బాధితుల కోసం భారీగా విరాళాలు సేకరించి తన పెద్ద మనసును చాటుకున్నారు. 46 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంటారు నేహా ధూపియా. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేహా.. తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
కాగా.. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే నేహా ధూపియా... తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడ్డారు. వెనుక వైపు నుంచి ఫోటోలు, వీడియోలను మీలో ఎవరు తీస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు? దానిని వెంటనే ఆపండి. నా విషయంలోనే కాదు.. ఏ హీరోయిన్‌ని కూడా వెనుక నుంచి ఫోటోలు తీయొద్దు. బ్యాగులు సర్దుకోవడం, పుస్తకాలు తీసుకోవడం, చివరికి నడిచేటప్పుడు కూడా మమ్మల్ని వెనుక నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇలాంటి పనులు చేయొద్దని పదే పదే చెప్పి మాకు విసుగు వచ్చేసింది. ఇకపై ఇలాంటివి అసలు కుదరదు, వెంటనే ఆపేయండి. మేం మిమ్మల్ని ఎంతో గౌరవంతో పలకరిస్తున్నాం.. కాబట్టి మీరు కూడా అంతే మర్యాదగా నడుచుకోండి అని నేహా సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే నేహా ధూపియా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఉంది. ఇటీవల ఆమె రన్నింగ్ ట్రాక్‌పై పరిగెడుతుండగా కొందరు ఆమెకు తెలియకుండా వెనుక నుంచి తీసిన ఫోటోలు వైరల్ అవ్వగా.. నెటిజన్లు దారుణంగా కామెంట్స్ పెట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెకు ముంబై ఈవెంట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ఫోటోలు తీస్తుండటంతో పాత విషయాలు గుర్తొచ్చి వెంటనే ఒక్క క్షణం ఆగి అందరికీ క్లాస్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications



