ఇండస్ట్రీలోకి రాకముందే స్టార్ హీరోతో డేటింగ్.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో 'సామజవరగమన' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెబా మోనికా జాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే ఓ స్టార్ హీరో తనను డేటింగ్‌కు ఆహ్వానించాడని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆ హీరో పేరు మాత్రం వెల్లడించకుండా సస్పెన్స్‌లో పెట్టడం మరింత ఆసక్తిని పెంచింది. ఇదే ఇంటర్వ్యూలో దళపతి విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా పంచుకుంది. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
కష్టానికి ఫలితం.. సొంత ఇంట్లో అడుగుపెట్టిన బుల్లితెర కమెడియన్!
కష్టానికి ఫలితం.. సొంత ఇంట్లో అడుగుపెట్టిన బుల్లితెర కమెడియన్!

బెంగళూరుకు చెందిన రెబా మోనికా జాన్ 2016లో విడుదలైన మలయాళ సినిమా 'స్వర్గరాజ్యం' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం తమిళంలో వరుస అవకాశాలు అందుకుని బిగిల్, ఫోరెన్సిక్, ఎఫ్‌ఐఆర్, మైఖేల్, బూ, జరుగండి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన 'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులతో ఆకట్టుకుంది. ఇటీవల కూలీ సినిమాలో శ్రుతి హాసన్ చెల్లెలి పాత్రలో నటించింది.

Reba Monica John Makes Shocking Dating Revelation Before Film Industry Entry

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెబా మోనికాకు యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. "సినీ ఇండస్ట్రీలోకి రాకముందే ఓ పవర్‌ఫుల్ స్టార్ హీరో మిమ్మల్ని డేటింగ్‌కు పిలిచాడనే వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉందా?" అని ప్రశ్నించగా, ఆమె మొదట నవ్వుతూ స్పందించింది. వెంటనే "ఒక స్టార్ నా ... చాలామంది స్టార్ హీరోలా" అని తిరిగి ప్రశ్నించింది. తరువాత వివరణ ఇస్తూ రెబా.. "అవును... అలాంటి ఆహ్వానాలు రావడం నిజమే. ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు చాలా సహజం. కానీ అసలు ప్రశ్న వాళ్లు పిలిచారా? కాదా? కాదు... నేను వెళ్లానా? లేదా? అనేదే ముఖ్యం" అని చెప్పింది. అయితే నిజంగా ఆ ఆహ్వానాలను స్వీకరించారా లేదా అనే ప్రశ్నకు మాత్రం ఆమె నేరుగా సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో తప్పించుకుంది.

Recommended For You
Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్
Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్

తాను అలాంటి విషయాలను ఎప్పుడూ పెద్దగా సీరియస్‌గా తీసుకోనని రెబా తెలిపింది. "ఎవరైనా నన్ను కలవాలని లేదా డేట్‌కు రావాలని అడిగితే, నాకు సమయం లేదని, ప్రస్తుతం షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని మర్యాదగా చెబుతాను. దాంతో వాళ్లు కూడా అర్థం చేసుకుని వెనక్కి తగ్గిపోతారు. నేను ఏ విషయాన్నైనా పాజిటివ్‌గానే తీసుకుంటాను" అని పేర్కొంది. ఇంటర్వ్యూలో భాగంగా దళపతి విజయ్‌తో కలిసి నటించిన 'బిగిల్' సినిమా గురించి కూడా రెబా మాట్లాడింది. "ఆ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది నన్ను ఆ పాత్రతో గుర్తుపెడుతుంటారు.

You May Also Like
 Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?

సోషల్ మీడియాలో కూడా 'బిగిల్' పేరుతో నన్ను ట్యాగ్ చేస్తుంటారు. ఒక నటిగా దానికంటే పెద్ద సంతోషం ఏముంటుంది" అని చెప్పింది. అలాగే విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. "సుమారు 45 రోజుల పాటు విజయ్‌తో కలిసి షూటింగ్ చేశాను. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఎప్పుడూ స్టార్ అన్న భావనతో ప్రవర్తించరు. చాలా సింపుల్‌గా, అందరితో కలిసిమెలిసి ఉంటారు. సెట్స్‌లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. నాకు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన ఒక హీరోనే'అంటూ ప్రశంసలు కురిపించింది.

OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

రెబా మోనికా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా 'ఇండస్ట్రీలోకి రాకముందే చాలామంది స్టార్ హీరోలు డేటింగ్‌కు ఆహ్వానించారు' అన్న వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X