సమంత నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. మ్యాటర్నిటీ బ్రేక్‌కు ముందు కొత్త అవతారంలో..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా మారింది. మొదటగా మూడేండ్ల విరామం తర్వాత తెలుగులో 'మా ఇంటి బంగారం' సినిమాతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సమంత.. బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటింది. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా నిలిచింది. ఈ సక్సెస్ సెలబ్రెషన్స్ తో పాటు సమంత తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది.
ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. మ్యాటర్నిటీ బ్రేక్ ముగిసిన తర్వాత వరుసగా మరిన్ని సినిమాలు చేస్తానని హామీ ఇచ్చింది. ప్రస్తుతం సమంత తన పర్సనల్ లైఫ్ కు ప్రాధాన్యత ఇస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో సమంత తన బేబీ బంప్ ఫోటోలను, తన వర్కవుట్స్ సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. వీటికి అభిమానుల నుంచి ఎనలేని స్పందన వస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సమంత కెరీర్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లీవ్ (Sony LIV)తో సమంత ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా తమిళ భాషలో రూపొందనున్న ఓ సెలబ్రిటీ టాక్ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
గతంలో ఆహా ఓటీటీలో ప్రసారమైన 'సామ్ జామ్' టాక్ షోతో హోస్ట్‌గా సమంత వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా సామ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రముఖ సినీ తారలు, దర్శకులు, ఇతర సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఆమె సొంతం. తనదైన ప్రత్యేక స్టైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పడు అదే తరహాలో తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సోనీ లివ్ ఈ కొత్త టాక్ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. కానీ, అతి తర్వలో ఈ షోకు సంబంధించిన వివరాలను వెల్లడించబోతున్నట్లు ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. మ్యాటర్నిటీ బ్రేక్‌కు వెళ్లే ముందు సమంత కొన్ని ఎపిసోడ్‌ల షూటింగ్ పూర్తి చేస్తుందా? లేక ప్రసూతి విరామం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో షూటింగ్‌లో పాల్గొంటుందా? అనే విషయం కూడా తెలియల్సి ఉంది.
வணக்கம் மக்களே!
— Sony LIV (@SonyLIV) July 3, 2026
We’ve been working on something special and can’t wait to share the details with you ❤️
Coming soon!!! #SonyTamil @Samanthaprabhu2 @SonylivTam pic.twitter.com/ITcTapOpo3
'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ జోరు..
ఇదిలా ఉంటే.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మూడేంళ్ల తర్వాత సమంత తెలుగులోకి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటూ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాదు.. ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్లు అందుకుంటుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. 'మా ఇంటి బంగారం'ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.87.67 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.63.32 కోట్ల గ్రాస్ రాబట్టగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.24.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇండియాలో ఈ సినిమా రూ.54.70 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి అత్యధికంగా రూ.51.89 కోట్ల నెట్ వసూలు చేయగా, తమిళ వెర్షన్ రూ.2.81 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వీకెండ్ లో మరోసారి భారీ కలెక్షన్లు వసూలు చేసే అవకాశముంది. ఇక ఫైనల్ రన్‌లో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications




