మూడుసార్లు అదే తప్పు.. త్రిష ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.చాలా గ్యాప్ తరువాత త్రిష.. తెలుగులో విశ్వంభర సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ఓవైపు రాజకీయాల్లో ఆమె పేరు మారుమోగుతుండగా.. ఇటు సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. తాజాగా త్రిష తన ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఇంతకీ ఏమైందంటే?

Also Read
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌‌తో జయకృష్ణ
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌‌తో జయకృష్ణ

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే.. ఈసారి ఆమె సినిమా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కారణంతో కాదు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా (Zara)పై చేసిన బహిరంగ ఫిర్యాదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక అంతర్జాతీయ బ్రాండ్ అందిస్తున్న సేవలపై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended For You
20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్? రామ్ చరణ్ కోసం సుకుమార్ కొత్త ప్రయోగం!
20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్? రామ్ చరణ్ కోసం సుకుమార్ కొత్త ప్రయోగం!
Trisha Krishnan Slams Zara Over Smelly Clothes Delivery

త్రిష ఇటీవల జారా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొన్ని దుస్తులను ఆర్డర్ చేశారు. అయితే పార్సిల్ తెరిచిన తర్వాత ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. డెలివరీ అయిన దుస్తుల నుంచి భరించలేనంత దుర్వాసన వస్తోందని, ఇది ఒక్కసారి కాదు వరుసగా మూడోసారి జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జారా అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ త్రిష స్పందించారు.

You May Also Like
అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!
అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!

"డియర్ జారా... ఒక చిన్న విజ్ఞప్తి. హోమ్ డెలివరీ కోసం పంపించే దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా చూసుకోండి. వరుసగా మూడోసారి ఇదే అనుభవం ఎదురైంది. కనీసం ప్యాక్ చేసే ముందు ఒకసారి వాసన చూసి పంపించండి. ఇది నిర్లక్ష్యం." అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కూడా తమకు ఎదురైన షాపింగ్ అనుభవాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. జారా ఫ్యాషన్ బ్రాండ్ కు ఇండియాలో లక్షలాది మంది కస్టమర్లు ఉన్నారు. అలాంటి బ్రాండ్‌పై త్రిష లాంటి ప్రముఖ నటి బహిరంగంగా ఫిర్యాదు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే.. జారా ఈ ఫిర్యాదుపై స్పందిస్తుందా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పెళ్లిపై ఎట్టకేలకు నోరు విప్పిన యాంకర్ ప్రదీప్.. 'ఆ రోజు చెబుతా అంటూ'..
పెళ్లిపై ఎట్టకేలకు నోరు విప్పిన యాంకర్ ప్రదీప్.. 'ఆ రోజు చెబుతా అంటూ'..

ఇటీవల త్రిష వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష చేసిన పోస్టు, అలాగే ఇద్దరూ కొన్ని కార్యక్రమాల్లో కలిసి కనిపించడం వల్ల ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే ఈ ప్రచారాలపై ఇప్పటివరకు త్రిష గానీ, విజయ్ గానీ అధికారికంగా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X