ఆ స్వార్థంతోనే బిగ్ బాస్‌కి వెళ్లాను.. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లను: మాజీ కంటెస్టెంట్

తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జోర్దార్ సుజాత.. ప్రస్తుతం 'సేవ్ ది టైగర్స్' సీజన్-3తో మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, బిగ్‌బాస్ అనుభవం, సినిమాల్లోకి వచ్చిన తీరు, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా 'సేవ్ ది టైగర్స్' గురించి మాట్లాడుతూ.. మొదటి సీజన్ ప్రేక్షకులకు ఓ మ్యాజిక్‌లా అనిపించిందని, రెండో సీజన్ అదే స్థాయి వినోదాన్ని కొనసాగించిందని, ఇప్పుడు మూడో సీజన్ అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని చెప్పారు.

Also Read
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న జయకృష్ణ
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న జయకృష్ణ

సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారనే ప్రశ్నించగా సుజాత ఇంట్రెస్టింగ్ సమధానం ఇచ్చింది. తన కెరీర్ పూర్తిగా అనుకోకుండా ప్రారంభమైందన్నారు. 'జోర్దార్' కార్యక్రమానికి యాంకర్‌గా అవకాశం రావడం నా జీవితాన్ని మార్చేసింది. ఆ షోతో వచ్చిన గుర్తింపే నన్ను బిగ్‌బాస్ వరకు తీసుకెళ్లింది. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత వ్యక్తిగతంగా చాలా మారాను. నలుగురిలో ఎలా మెలగాలి, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి వంటి ఎన్నో విషయాలు అక్కడ నేర్చుకున్నాను" అని చెప్పారు. అలాగే 'జబర్దస్త్'లో చేసిన తర్వాత తనకు మరింత గుర్తింపు వచ్చిందని, అదే సమయంలో నటిగా కూడా అవకాశాలు రావడం ప్రారంభమైందని తెలిపారు.

Jordar Sujatha Opens Up on Bigg Boss Journey and Why She Said No to Season 10
Recommended For You
20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్? రామ్ చరణ్ కోసం సుకుమార్ కొత్త ప్రయోగం!
20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్? రామ్ చరణ్ కోసం సుకుమార్ కొత్త ప్రయోగం!

సినిమాల్లో నటించాలనే ఆలోచన మొదట్లో తనకు లేదని సుజాత చెప్పారు. గతంలో విన్న కొన్ని సంఘటనలు, ఒక సినిమా అవకాశం సందర్భంగా ఎదురైన చేదు అనుభవం వల్ల సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే.. 'సేవ్ ది టైగర్స్' దర్శకుడు తేజ, తన భర్త రాకేష్‌కు ఫోన్ చేసి కథ వినమని చెప్పడంతో ఇష్టంలేకుండానే వెళ్లానని చెప్పారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారని తెలిసి కథ విన్నానని, కథ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించానని తెలిపారు.

You May Also Like
అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!
అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!

ఇక ఈ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌పై సుజాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ సీజన్-10లో అవకాశం వస్తే వెళ్తారా? షో చూస్తున్నారా? అని అడగగా సుజాత నవ్వుతూ స్పందించారు. "నేను బిగ్‌బాస్‌కు దండం పెడతా. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు ఒక్క సీజన్ కూడా పూర్తిగా చూడలేదు. కరోనా సమయంలో అందరూ బయట ఇబ్బందులు పడుతుంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటే కనీసం సేఫ్‌గా ఉంటాననే ఒక స్వార్థ ఆలోచనతోనే ఆ షోలోకి వెళ్లాను" అని చెప్పారు. అయితే తాను ఏ ఉద్దేశంతో వెళ్లినా.. బిగ్‌బాస్ మాత్రం తనకు మంచి కెరీర్ ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

Alpha Movie Twitter Review: అల్ఫా మూవీ ట్విట్టర్ రివ్యూ..
Alpha Movie Twitter Review: అల్ఫా మూవీ ట్విట్టర్ రివ్యూ..

తాను పాల్గొన్న సీజన్‌లోని కంటెస్టెంట్స్‌తో కూడా ఇప్పటికీ పెద్దగా సంబంధాలు లేవని సుజాత వెల్లడించారు. "ఎప్పుడైనా ఈవెంట్లలో కలిస్తే హాయ్, బాయ్ చెప్పుకునేంత మాత్రమే. బిగ్‌బాస్‌లోకి వెళ్లే వరకు ఆ షో ఫార్మాట్ కూడా నాకు పూర్తిగా తెలియదు. నా గురించి ఎవరైనా ఏమైనా అనుకున్నా నేను స్వీకరిస్తాను" అని చెప్పారు. మళ్లీ అవకాశం వస్తే బిగ్‌బాస్‌లో పాల్గొంటారా? అని ప్రశ్నించగా.. "ఇప్పుడు మాత్రం వెళ్లలేను. నా జీవితంలో ప్రాధాన్యతలు మారిపోయాయి. ప్రస్తుతం నా కూతురుతో సమయం గడపడమే నాకు ముఖ్యమైన విషయం. అందుకే మరోసారి బిగ్‌బాస్‌లో పాల్గొనే ఆలోచన లేదు" అని తేల్చిచెప్పారు.

Nagabandham Public Talk: నాగబంధం పబ్లిక్ టాక్..
Nagabandham Public Talk: నాగబంధం పబ్లిక్ టాక్..

కరోనా సమయంలో భద్రత కోసం బిగ్‌బాస్‌లోకి వెళ్లానని, కానీ అదే షో తనకు కెరీర్‌లో కొత్త అవకాశాలను తీసుకొచ్చిందని జోర్దార్ సుజాత చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X