1000 అబద్ధాలు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి రామ్ శంకర్, ఎస్తర్ , నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ నిర్వహించారు మరియు నిర్మాతలు పి సునీత, ఎన్ సీతా రామయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గోగుల్ స్వరాలు సమకుర్చారు.
కథ
సత్య (సాయిరాం శంకర్) ఓ యాడ్ ఏజెన్సీ యజమాని. ఈ క్రమంలో సత్య(ఏస్తర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అప్పటికే సత్యకు నిశ్చితార్థం అయిందని తెలుస్తుంది. ఆమె ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అబద్దాలు ఆడటం మొదలు పెడతాడు. నిశ్చితార్థం చెడగొట్టి మొత్తానికి ఆమెను పెళ్లాడుతాడు. అయితే తనను అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకుని అతనికి దూరం అవుతుంది. దూరమైన హీరోయిన్‌ను హీరో ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ.