118 (2019)(U/A)
Release date
01 Mar 2019
genre
118 స్టోరి
118 సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, నివేద తామస్, షాలిని పాండే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వి గుహన్ వహించారు మరియు నిర్మాత ఎస్ మహేష్ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించారు.
కథ
గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు. అన్యాయాలను, అక్రమాలను ధీటుగా ఎదిరిస్తుంటాడు. మేఘా (షాలిని పాండే)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ క్రమంలో ప్రతీ పౌర్ణమి రోజున ఆద్య (నివేదా థామస్) అనే అమ్మాయి దాడికి గురైనట్టు కల వస్తుంటుంది. కలలో కనిపించిన అమ్మాయి ఉన్న ప్రాంతాలు గౌతమ్‌కు తారసపడుతాయి. దాంతో ఆద్య కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆ సర్చింగ్‌లో భయంకర నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. గౌతమ్‌కు ఆద్య తారసపడిందా? ఒకవేళ కలిస్తే ఆద్యను గౌతమ్ ఎలా కలిసుకొన్నాడు? ఆద్య మీద ఎందుకు దాడి జరిగింది? ఆద్య కోసం వెతికే క్రమంలో కలిసే ప్రతీ వ్యక్తి ఎందుకు మృత్యువాత పడుతారు? చివరికి ఆద్యకు జరిగిన అన్యాయం ఏంటి? ఓ భయంకరమైన విషయాన్ని ఆద్య ఎలా బయటపెట్టింది. గౌతమ్‌తో కలిసి ఆద్య మెడికల్ మాఫియా ముఠాను ఆటకట్టించింది అనే ప్రశ్నలకు సమాధానమే 118 మూవీ కథ.
**Note:Hey! Would you like to share the story of the movie 118 with us? Please send it to us ([email protected]).