24 కిస్సెస్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అయోధ్య కుమార్ వహించారు మరియు నిర్మాత గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జోయి బరుణ్ అందించారు.
కథ
ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. ఫిల్మ్ మేకింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొన్న మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ శ్రీలక్ష్మితో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకొంటాడు. సహజీవనంతోనే జీవితాన్ని చాలించాలనుకొనే మనస్తత్వం కలిగి ఉంటాడు. దాంతో ఆనంద్, శ్రీలక్ష్మీ మధ్య అపోహలు పెరిగి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆనంద్, శ్రీలక్ష్మి బ్రేకప్ తర్వాత వారిద్దరూ మళ్లీ కలిశారా? శ్రీలక్ష్మి ప్రేమను పొందడానికి ఆనంద్ తన అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఆనంద్ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి బలమైన కారణమేమిటి? కథలో సైక్రియాటిస్ట్ రాంమూర్తి (రావు రమేష్) పాత్ర ఏంటి? సీనియర్ నటుడు నరేష్ ఎలాంటి పాత్రను పోషించాడు? అసలు 24 ముద్దుల వెనుక అసలు రహస్యం ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే 24 కిసెస్.