X
Home టాప్ లిస్టింగ్

ఉగాదికి సినీ పండగ.. థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే

Author Administrator | Published: Tuesday, March 21, 2023, 04:53 PM [IST]

ఈ ఉగాది పండుగ సందర్బంగా అటు థియేటర్ల లో, ఇటు ఓటీటీల్లో సినీ ప్రేక్షకులను అలరించటానికి సినిమాలు సిద్దమయ్యాయి. ఈ క్రమంలో థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు ఏంటో తెలుసుకుందామా. ఇక ఈ పండగ రోజుల థియేటర్లలో సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రాలు సినీ ప్రియులను అలరించేందుకు సిద్దమయ్యాయి.


cover image
రంగ మార్తాండ
1

కృష్ణవంశీ తెరకెక్కించిన దర్శకత్వం వహించిన  రంగమార్తాండ మూవీ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా లో  ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతంఅందించారు. ప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆసక్తిని పెంచాయి.

 

దాస్ కా ధమ్కీ
2

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వియ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం దాస్ కా ధమ్కీ. నివేత పేతురేజ్, రావు రమేష్, అజయ్, రోహిణి, అక్షర గౌడ తదితరులు  నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఎక్కువ బజ్ నెలకొంది.  ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గీత సాక్షిగా
3

గీత సాక్షిగా మూవీ క్రైమ్, థ్రిల్లర్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా శ్రీకాంత్ అయ్యంగార్‌, రూపేష్ శెట్టి, చ‌రిష్మా, భ‌ర‌ణి శంక‌ర్‌, జ‌య‌ల‌లిత‌, అనితా చౌద‌రి, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.

కోస్టి
4

కోస్టి మూవీ కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కాజల్ అగర్వాల్,  యోగి బాబు, కె ఎస్ రవి కుమార్, ఊర్వశి, సత్యన్, మనోబాల, సుబ్బు పంచు, రాధికా శరత్ కుమార్ తదితరులు నటించారు.  సినిమాకి దర్శకత్వం కళ్యాణ్ వహించారు.  ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.

కథ వెనుక కథ
5

కథ వెనుక కథ  మూవీ   థ్రిల్లర్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు నటించారు. కృష్ణ చైత‌న్య  దర్శకత్వం వహించారు.  దంద‌మూడి అవ‌నీంద్ర కుమార్ నిర్మాత‌గా దండ‌మూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మార్చి 24న విడుదల కానుంది.

 

6

అమెజాన్ ప్రైమ్ లో మార్చి 22 ఉగాది రోజు సూపర్ బ్లాక్ బాస్టర్ పఠాన్ విడుదల కానుంది. ఉగాది రోజున‌ షారుఖ్‌ఖాన్  లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌ఠాన్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

వినరో భాగ్యము విష్ణు కథ
7

ఆహాలో మార్చి 22న వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ కానుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం  హీరోగా న‌టించిన విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ల‌వ్‌, యాక్ష‌న్, దేశ‌భ‌క్తి ఇలా మిక్స‌డ్ జోన‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పంచతంత్రం
8

బ్ర‌హ్మానందం, క‌ల‌ర్స్ స్వాతి, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, న‌రేష్ అగ‌స్త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన పంచ‌తంత్రం సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఐదు క‌థ‌ల స‌మాహారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+